వారంలో బాబు ఇంటిని ఖాళీ చేయాలి..?

Update: 2019-09-21 05:31 GMT
ఏపీ రాజధాని అమరావతిలో అక్రమంగా నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి అద్దెకు ఉండే ఇంటికి రెండోసారి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా సదరు ఇంటిని నిర్మించినట్లుగా అధికారులు తేల్చటం తెలిసిందే. తాజాగా జారీ చేసిన నోటీసుల్లో ఈ ఇంటిని వారం వ్యవధిలో ఖాళీ చేయాలని పేర్కొన్నారు.

గతంలో ఇచ్చిన నోటీసుకు తాజా నోటీసు కొనసాగింపుగా చెబుతున్నారు. గతంలో సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నోటీసులకు ఇంటి యజమాని లింగమనేని రమేశ్ వివరణ ఇచ్చారు. అయితే.. ఈ వివరణ సంతృప్తికరంగా లేదని తాజాగా జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. వారంలో ఇంటిని ఖాళీ చేయాలన్న నోటీసును బాబు నివాసం ఉండే అద్దెంటిపైన అతికించారు అధికారులు.

గ్రౌండ్ ఫ్లోర్.. ఫస్ట్ ఫ్లోర్.. స్విమ్మింగ్ పూల్.. ఫస్ట్ ఫ్లోర్ లోని డ్రెస్సింగ్ రూమ్ లు రూల్స్ కు విరుద్ధంగా నిర్మించినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారం వ్యవధిలో ఇంటిని ఖాళీ చేయాలన్న నేపథ్యంలో టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News