కృష్ణా నదిపై చంద్రబాబు ఉంటున్న నివాసం సహా మొత్తం 24 అక్రమ కట్టడాలు ఉన్నాయని అమరావతి సీఆర్డీఏ అధికారులు తేల్చారు. ఈ మేరకు మొత్తం 24 కట్టడాలకు నోటీసులు జారీ చేశామని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో నిబంధనలకు విరుద్థంగా ఉన్న పాతూరి నాగభూషణం ఇంటిని కూల్చివేశామని వివరణ ఇచ్చారు.
మొత్తం 24 అక్రమ కట్టడాల లిస్ట్ ను సీఆర్డీఏ అధికారులు మీడియాకు విడుదల చేశారు. ఇందులో ఐదుగురు యజమానులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని.. వాటిని మొదట కూల్చివేస్తామని తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు నివాసంతోపాటు శివస్వామి ఆశ్రమం రెండు భవనాలు - అక్వాడెవిల్స్ కట్టడం - మరో 3 అంతస్థుల భవనాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు..
ఇక మిగిలిన 19 అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వగా వారు ఇచ్చిన వివరణలను పరిశీలిస్తున్నామని సీఆర్డీఏ పేర్కొంది.
ప్రస్తుతానికి చంద్రబాబు సహా మిగిలిన నలుగురి భవనాలను కూల్చివేసే పనిలో సీఆర్డీఏ అధికారులున్నారు.