దేశంలోనే టాప్ హీరోయిన్ దీపికా పడుకొనే. మన తెలుగు హీరోలకంటే మించి రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన దీపికా ఏకంగా సినిమాకు రూ.30 కోట్లు తీసుకుంటుందని ఇన్ సైడ్ టాక్.అలాంటి దీపికా పడుకొనే ఉపాధి హామీ పనికి వెళుతోందట.. కూలి పనిచేస్తోందట.. నిజంగా నిజం ఇదీ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ చోద్యం చోటుచేసుకుంది. దీపికనే కాదు.. మరో హీరోయిన్ జాక్వెలిన్ కూడా ఉపాధి జాబ్ కార్డు కలిగి ఉండడం విశేషం. ఇప్పుడు ఫొటోలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని చేపట్టింది. ఈ పథకంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే లబ్ధిదారుగా ఉండడం చూసి అందరూ అవాక్కయ్యారు. మరో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా కూలీ పనిచేస్తున్న జాబ్ కార్డులో ఉంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జిర్న్యా జిల్లా పిపర్ ఖేడా నకా పంచాయితీలో సర్పంచ్, కార్యదర్శి కలిసి బాలీవుడ్ హీరోయిన్లు దీపిక, జాక్వెలిన్ ఫొటోలతో పథకం లబ్ధిదారుల నకిలీ జాబ్ కార్డులు సృష్టించి సొమ్ము చేసుకున్న వైనం వెలుగుచూసింది. ఆయా ఖాతాల నుంచి డబ్బు తీసుకునేందుకు నకిలీ జాబ్ కార్డులను ఉపయోగించారు.దీపికా ఉపాధి జాబ్ కార్డ్ సృష్టించి ఏకంగా రూ.30వేల రూపాయలను డ్రా కూడా చేసుకున్నారు.
ప్రతి నెల ఈ నిర్వాకం సాగింది. ప్రభుత్వం నుంచి నకిలీ జాబ్ కార్డులతో సొమ్ము కాజేసిన ఈ అక్రమ వ్యవహారం గుట్టు రట్టయ్యింది. ఈ ఘటనపై జిల్లా పంచాయితీ సీఈవో గౌరవ్ బెనల్ తాజాగా విచారణకు ఆదేశించారు. సర్పంచ్, కార్యదర్శి ఉపాధి హామీ అసిస్టెంట్ కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని ప్రాథమికంగా తేల్చారు.