అభిమానం అందరికి ఉంటుంది. దీంతో వచ్చే ప్రమాదం అంటూ ఏమీ ఉండదు. అభిమానం కాస్తా ఆరాధగా మారి.. దానికి ఆత్మవిశ్వాసం యాడ్ అయితేనే అసలు ఇబ్బంది. ఇప్పుడు అలాంటి సీనే రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు భారీగా సాగుతున్నాయి. అనధికార సమాచారం ప్రకారం ఎన్నికల మీద బెట్టింగ్ రాయుళ్ల బెట్టింగుల విలువ వేల కోట్లకు పైనే ఉంటుందని చెబుతున్నారు.
ఈ బెట్టింగులు ఎంతలా ఉంటాయనటానికి ఒక ఉదాహరణ ఇక్కడ ప్రస్తావించాలి. గోదావరి జిల్లాలకు చెందిన ఒక వ్యాపారవేత్త.. జనసేనకు పది సీట్లు కూడా రావని రూ.15లక్షల బెట్టింగ్ పెడితే.. కచ్ఛితంగా వస్తాయని మరో వ్యాపారవేత్త సై అన్నారు. జనసేనకు వచ్చే సీట్ల మీద ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఈ తరహా బెట్టింగులు చోటు చేసుకుంటుంటే.. ఇక.. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న బెట్టింగుల మామూలుగా లేవు.
టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సీట్లు మొదలు.. బాబు.. జగన్ లలో సీఎం అయ్యేదెవరన్న విషయంతో పాటు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ప్రాంతాల వారీగా వచ్చే సీట్ల మీదా.. పలువురు ఎమ్మెల్యే.. ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన గెలుపోటములు.. మెజార్టీల విషయాలు.. ఇలా ఒకటేమిటి? ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల మీద బెట్టింగులు చోటు చేసుకోవటం కనిపిస్తోంది.
ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనూ వేల కోట్ల రూపాయిలు ఈ రోజు ఫలితాలు వెల్లడైన వెంటనే చేతులు మారే అవకాశం ఉంది. బెట్టింగుల పుణ్యమా అని.. మునిగేది ఎంతమంది? తేలేది ఎంతమంది? అన్న విషయాలు బయటకు రాకున్నా.. తుది ఫలితాల ఆధారంగా మునిగిపోయినోళ్లు ఎవరన్న విషయం మీద మాత్రం క్లారిటీ రావటం కాయం.