ఇటీవల ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్డీయే అభ్యర్థి రాంనాధ్ కోవింద్ కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. తెలంగాణలో అయితే.. యూపీఏ అభ్యర్థికి అనుకూలంగా తెరాస సభ్యులు కొందరు క్రాస్ ఓటింగ్ చేస్తారని కాంగ్రెస్ నాయకులు ముందుగానే మేకపోతు గాంభీర్యంతో పలికారు గానీ... అలాంటిదేమీ జరగలేదు. కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు విషయంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా ఉన్నదని పలువురు భావిస్తున్నారు. భాజపాలో ఎంతో సీనియర్ అయిన వెంకయ్యనాయుడుకు దేశవ్యాప్తంగా దాదాపు అందరు విపక్ష నాయకులు - విపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో కూడా చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. రాజకీయాల్లో శత్రువులు ఉండనే ఉండరు - ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు.. అని వెంకయ్య చాలా స్పష్టంగా చెప్పారు కూడా! ఆయన వ్యక్తిగత ప్రస్థానంలోనూ అది నిజం. ఇప్పుడు అది నిరూపణ కావచ్చునని పలువురు అనుకుంటున్నారు.
మామూలుగా అయితే రాంనాధ్ కోవింద్ కు వచ్చిన మెజారిటీ కంటె.. వెంకయ్యనాయుడుకు లభించే మెజారిటీ తగ్గాలి. ఎందుకంటే.. అప్పట్లో కోవింద్ కు మద్దతు ఇచ్చిన బీహార్ లోని నితీశ్ సారథ్యంలోని జేడీయూ ఇప్పుడు యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి అనుకూలంగా పనిచేయబోతోంది. అందుకోసమైనా వెంకయ్య మెజారిటీ తగ్గాలి. కానీ.. వాస్తవంలో వెంకయ్య మెజారిటీ పెరిగే అవకాశం ఉందనేది పలువురి అంచనా. కాంగ్రెస్ ఇతర విపక్షాల్లోని కొందరు సభ్యులు కూడా వెంకయ్యకు ఓటు వేయచ్చునని పలువురు అనుకుంటున్నారు.
అభ్యర్థి అయిన తర్వాత కోవింద్ ప్రతి రాష్ట్రమూ తిరిగి ఎన్నికల ప్రచార సమావేశాలు నిర్వహించారు. కానీ వెంకయ్యనాయుడు తన అభ్యర్థిత్వమూ, ఎన్నికా... దానికి ప్రచారం గురించి.. ఏమీ పట్టించుకోవడంలేదు. ఏదో సన్మానాలు సత్కారాలు చేయించుకుంటున్నారు తప్ప.. ఏపీ తెలంగాణకు వచ్చినా కూడా.. అందరు ప్రజాప్రతినిధులతో సమావేశమై ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం లేదు.
ఇదంతా ఇలా ఉన్నప్పటికీ తాజా పరిణామాల్లో కొన్ని అంశాలు క్రాస్ ఓటింగ్ సంకేతాల్లా ఉన్నాయని పలువురు అంటున్నారు. వెంకయ్యకు శుక్రవారం నాడు హైదరాబాదులో జరిగిన సత్కారంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జానారెడ్డి పాల్గొని చాలా క్లోజ్ గా మెలిగారు. నిజానికి ఇంతకంటె క్లోజ్ అయిన వాళ్లు కూడా అనేకులు విపక్షాల్లో ఉన్నారు. వారంతా తమ వ్యక్తిగత పరిచయాన్ని పురస్కరించుకుని వెంకయ్యకు ఓటు వేయకుండా ఉండబోరని అంచనాలు సాగుతున్నాయి. మరి వెంకయ్యనాయుడు ఎంత మెజారిటీ సాధిస్తారో లెక్క తేలితే.. క్రాస్ ఓటింగ్ పై క్లారిటీ వస్తుంది.