తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రపురం రాజకీయాలే సపరేట్. ఇక్కడ రెండు ప్రధాన సామాజికవర్గాలే ప్రతి ఎన్నికల్లో ఆదిపత్యం చెలాయిస్తుంటాయి.. కాపులు, శెట్టి బలిజలకే ప్రధాన పార్టీలు టికెట్లు కేటాయిస్తాయి. ఏ సామాజికవర్గం ఓట్లు చీలినా ఆ అభ్యర్థి ఓడిపోయినట్టే. అందుకే ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్లే ఎక్కువగా గెలిచారు. 1955 నుంచి 15 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే ఐదుసార్లు ఇండిపెండెంట్లు గెలవడం విశేషం. నాలుగు సార్లు టీడీపీ, ఐదుసార్లు కాంగ్రెస్ గెలిచింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే, కాపు సామాజికవర్గానికి చెందిన తోట త్రిముర్తులు ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి బరిలో నిలిచారు. 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి పోటీపడ్డారు.
ఇక ఈయనకు ప్రత్యర్థిగా శెట్టి బలిజ కులానికి చెందిన చెల్లిబోయిన వేణు గోపాల కృష్ణ వైసీపీ తరుఫున బరిలో నిలిచారు. జడ్పీ చైర్మన్ అయిన ఈయన అసెంబ్లీకి పోటీచేయడం ఇది రెండోసారి. 2014లో కాకినాడ రూరల్ లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో రామచంద్రపురానికి మారి ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు.
వీరిద్దరికి ధీటుగా జనసేన పోలిశెట్టి చంద్రశేఖర్ ను బరిలో దింపడంతో రామచంద్రపురంలో త్రిముఖ పోటీ అనివార్యమైంది. ఈసారి రామచంద్రాపురంలో 87.11శాతం అత్యధిక పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో శెట్టి బలిజలు 48వేల మంది.. కాపులు 47వేల మంది..ఎస్సీలు 25వేల మంది కీలకంగా ఉన్నారు..
తోట త్రిముర్తులు, పోలిశెట్టి చంద్రశేఖర్ ఇద్దరూ కాపు సామాజికవర్గ నేతలే.. ఆ ఓట్లు చీలిపోయాయన్న అంచనాకు పార్టీలు వచ్చాయి. కాపు ఓట్లు వారికి చీలితే శెట్టి బలిజల ఓట్లన్నీ ఆ సామాజికవర్గానికి చెందిన వేణుగోపాల్ కృష్ణకు పడి ఆయన ఈజీగా గెలుస్తారన్న అంచనాకు వైసీపీ వచ్చింది.
ఇక టీడీపీకి, జనసేనకు కాపు ఓట్లు సమానంగా చీలితే.. అసెంబ్లీకి టీడీపీకి, పార్లమెంట్ కు జనసేనకు వేశారని టీడీపీ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఇక ఇక్కడ జనసేన ఫ్యాక్టర్ బాగా పనిచేసిందని..ఓట్లు బాగా పడ్డాయని ఆ పార్టీ అంచనావేస్తోంది. మొత్తం మీద రామచంద్రపురంలో నడుస్తున్న క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం చేకూరిందనేది మే 23నే తేలనుంది.