బీజేపీపై మండిపోతున్న జనాలు

Update: 2022-02-13 06:30 GMT
బీజేపీపై జనాలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన డెవలప్మెంట్ కారణంగా ముందు హ్యాపీగా ఫీలైన జనాలు రాత్రికి మండిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఈనెల 17వ తేదీన జరగనున్న సమావేశమే.

విభజన హామీల అమలు, పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక కమిటీని వేసింది. ఈ కమిటికి హోం శాఖ జాయింట్ సెక్రటరీ, తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో సమావేశం జరుగుతుందని కేంద్రం చెప్పింది.

అలాగే సమావేశంలో చర్చించేందుకు తొమ్మది అంశాలను కూడా ఫైనల్ చేసింది. ఇందులో ప్రత్యేకహోదా కూడా ఉంది. దీంతో జనాలంతా ఫుల్లు హ్యాపీ అయిపోయారు. ఇంకేముంది ఏపీకి ప్రత్యేకహోదా వచ్చేసినట్లే అనేంతగా వాతావరణం ఏర్పడింది. అయితే రాత్రయ్యేసరికి హోదా అంశం అజెండాలో నుండి మాయమైపోయింది.

ఇదే సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా వీడియో సందేశం ఇచ్చారు. ప్రత్యేకహోదా అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాదని అసలు హోదా అంశమే అజెండాలో లేదన్నారు.

జీవీఎల్ మాటలు వినగానే జనాలకు మండిపోయింది. దీనికి కారణం ఏమిటంటే అజెండాలో హోదా అంశాన్ని చేర్చిందే కేంద్రం. అలాంటిది తర్వాత మాయమైపోయిందంటే తెరవెనుక ఏదో రాజకీయం జరగిందనే అనుమానాలు పెరిగిపోయాయి.

ఇలాంటి సమయంలోనే జీవీఎల్ మాట్లాడటంతో బీజేపీపై జనాలు మండిపోతున్నారు. హోదా రావటం ఇష్టం లేని జీవీఎల్ లాంటి వాళ్ళే కేంద్రంలోని పెద్దలపై ఒత్తిడి తెచ్చి అజెండా నుండి హోదా  అంశాన్ని తప్పించారంటు జనాలు భగ్గుమంటున్నారు.

 ఇదే హోదా అంశంపై గతంలో జీవీఎల్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయ అంటూ చెప్పిన విషయం తెలిసిందే. అసలే నరేంద్ర మోడీపై బాగా కోపంగా ఉన్న జనాలకు తాజా పరిణామాలతో కాస్త హ్యాపీగా ఫీలయ్యారు.

 అలాంటిది రాత్రయ్యేసరికి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేసరికి కోపంగా ఉన్నారు. దీనికితోడు వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు తదితరులు అజెండా నుండి హోదా అంశం మాయమైపోవటానికి జీవీఎల్, సుజనాచౌదరి, సీఎం రమేష్ కారణమని చేసిన ఆరోపణలతో మరింతగా మంటలు మండుతున్నాయి. 
Tags:    

Similar News