టీ స్టాల్ లో క్రిప్టో చెల్లింపు.. చర్చకు తెరలేపిన కుర్రోడు..!

Update: 2022-12-02 13:30 GMT
మనదేశంలో చెల్లింపులన్నీ ‘రూపాయి’లోనే జరుగుతుంటాయి. ఇప్పుడిప్పుడు డిజిటల్ కరెన్సీ రూపంలో చెల్లింపులు జరుగుతున్నా ప్రతీఒక్కరూ మాత్రం రూపాయి మారకంలో చెల్లింపులు చేస్తుంటారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా డాలర్ తో రూపాయి విలువను పోలుస్తూ ఎగుమతులు.. దిగుమతులు వంటి పనులను ప్రభుత్వాలు చేస్తుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మాత్రం క్రిప్టో కరెన్సీని వినియోగిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి భారత్ లోనూ క్రిప్టో కరెన్సీ వాడకంపై చర్చోప చర్చలు నడుస్తున్నాయి. భారత్ క్రిప్టో కరెన్సీని పూర్తిగా వ్యతిరేకించడం లేదు అలాగే సమర్థించడం లేదు. అయితే 30 శాతం ట్యాక్స్ మాత్రం క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం వసూలు చేస్తోంది.

అయితే మనదేశంలోనూ క్రిప్టో చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నా వినియోగించే వారు తక్కువనే చెప్పాలి. చాలామందికి క్రిప్టో పై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. దీనికితోడు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ అమాంతం పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎవరూ కూడా క్రిప్టో కరెన్సీ జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది.

ఇలాంటి సమయంలో బెంగూళూరులో టీ స్టాల్ నడుపుతున్న ఓ కుర్రాడు తన షాపులో క్రిప్టో చెల్లింపులకు గ్రీన్ ఇచ్చాడు. అంతేకాకుండా ‘క్రిప్టో కరెన్సీ స్వీకరిస్తాం’ అంటూ ఏకంగా బోర్డు కూడా పెట్టేశాడు. దీంతో అతడి టీ స్టాల్ ఒక్కసారిగా వార్తలో నిలిచింది. మరోవైపు క్రిప్టో ఔత్సాహికులకు ఈ టీ స్టాల్ ‘హ్యాంగ్ అవుట్ జాయింట్’ గా మారింది.

శుభం సైనీ అనే డిగ్రీ డ్రాపౌట్ విద్యార్థి ‘ది ఫ్రస్టేటెడ్ డ్రాప్ అవుట్’ అనే పేరుతో ఈ టీ స్టాల్ ను ఏర్పాటు చేశారు. క్రిప్టో కరెన్సీపై మక్కువతో క్రిప్టో మార్కెట్ పై ట్రేడింగ్ మొదలుపెట్టిన సైనీ పెట్టుబడి పెట్టి కొన్ని నెలల వ్యవధిలోనే భారీగా సంపాదించారు. అతడి క్రిప్టో వాలెట్ 1.5 లక్షల నుంచి 30 లక్షల వరకు పెరిగింది.

అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ పడిపోవడంతో అతడి క్రిప్టో ఫోర్ట్ ఫోలియో 90 శాతం మేర పడిపోయింది. దీంతో అతడి జీవితం రాత్రి రాత్రే పడిపోయింది. దీంతో అతడు టీ స్టాల్ పెట్టుకుని క్రిప్టో చెల్లింపులను అంగీకరిస్తున్నారు. అయితే ఈ టీ స్టాల్ ఫోటోను ప్రముఖ వ్యాపార వేత్త గోయెంకా తన ట్వీటర్లో పోస్ట్ చేసిన ‘న్యూ ఇండియా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News