క్రిప్టో కరెన్సీకి చట్ట బద్ధత కల్పించడానికే కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు మరోసారి స్పష్టం అయ్యింది. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు స్వయంగా రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్‌దాస్ నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ కేంద్రం దీనికి సంబంధించి వచ్చే బడ్జెట్ లో ప్రకటన చేయటానికి రంగం సిద్దం చేస్తోంది.
ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని భావిస్తున్న 2022–23 బడ్జెట్ లోనే ఈ మేరకు ప్రతిపాదనలు ఉంటాయని ఆయన సూచించారు. క్రిప్టో కరెన్సీని కొందరు అసెట్‌గా భావిస్తున్నారని అన్నారు. తద్వారా వచ్చే ఆదాయంపై ఇప్పటికే కొంత మంది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని తరుణ్ బజాజ్ తెలిపారు.
ఇతర కొన్ని సేవల తరహాలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్ టీ) కూడా క్రిప్టోకి వర్తిస్తుందని చట్టం చాలా స్పష్టంగా చెబుతోందని వివరించారు. క్రిప్టో పై పన్ను అంశాల పై మేము దృష్టి సారిస్తాము. ఇప్పటికే ప్రజలు దానిపై పన్నులు చెల్లిస్తున్నారని అర్థం చేసుకున్నాము, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కొనుగోళ్ల పరిమాణం నిజంగానే చాలా పెరిగింది. ఈ అంశం పై పన్నులకు సంబంధించి కొన్ని చట్టపరమైన మార్పులు తీసుకురాగలమా లేదా అని చూద్దామని తరుణ్ బజాజ్ వ్యాఖ్యానించారు. అయితే ఇది బడ్జెట్ నాటికి సిద్ధం అవుతుందని, మనం ఇప్పటికే బడ్జెట్‌కు దగ్గరగా ఉన్నామని స్పష్టం చేసారు. బడ్జెట్ లో ప్రతిపాదనలను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలించాలని బజాజ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.