ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తాజాగా కీలకభేటి నిర్వహించారు. ఇప్పటికే ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎస్ నిర్వహించిన అత్యవసర భేటి చర్చనీయాంశమైంది.
ఎన్నికల విధులు, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ల ఏర్పాట్లపై సీఎస్ వారికి పలు సూచనలు చేసినట్టు సమాచారం. ఎస్ఈసీ నిమ్మగడ్డ దూకుడుగా వెళుతుండడంతో ఉద్యోగ సంఘాలతో సీఎస్ ఏం చర్చించారన్నది ఆసక్తిగా మారింది. కాగా ఏపీలో ఫిబ్రవరి 9,13,17,21 తేదీల్లో నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలను వ్యతిరేకించిన ఏపీ ప్రభుత్వం చివరకు సుప్రీంకోర్టు సూచనతో నిర్వహించడానికి సిద్ధమైంది.ఇప్పటికే ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఇన్నాళ్లుగా సహకరించని ఏపీ ప్రభుత్వం, సీఎస్, ఉద్యోగులు తాజాగా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధులవుతున్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.