పొట్టి క్రికెట్.. టీ20 మ్యాచ్‌లు రికార్డులకు నెలవు. టీ20 అంటేనే ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలవుతుంటాయి. బ్యాట్సమెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతుంటారు. టీ20లో బౌలర్లతో పోల్చితే బ్యాట్సమెన్లకే అవకాశం ఎక్కువ.
తాజాగా టీ20 క్రికెట్‌లో వరల్డ్ రికార్డు నమోదైంది. దక్షిణాఫ్రికాలో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) టీ20 ఛాలెంజ్ లీగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టైటాన్స్, నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 501 పరుగులు సాధించాయి. టీ20 క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌లోనే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 501 పరుగులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో ఈ స్థాయిలో పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సీఎస్‌ఏ లీగ్‌లో భాగంగా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (57 బంతుల్లో 162; 13 ఫోర్లు, 13 సిక్సర్లు) వీర విహారం చేయడంతో 20 ఓవర్లలో టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఛేదనలో నైట్స్ సైతం అదే రీతిలో బాదుడు మొదలుపెట్టింది. అయితే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. దీంతో 41 పరుగుల తేడాతో నైట్స్ ఓటమి పాలైంది.
కాగా ఈ మ్యాచ్‌లో ఏకంగా 36 సిక్సర్లు నమోదు కావడం మరో విశేషం. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్‌ల జాబితాలో ఈ మ్యాచ్ మూడో స్థానం దక్కించుకుంది.
కాగా టీ20లో గతంలో రెండు టీములు కలిపి సాధించిన అత్యధిక స్కోర్ 497 పరుగులుగా ఉంది. 2016లో సూపర్ స్మాష్ లీగ్‌లో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్స్-ఒటాగో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 497 స్కోర్ చేశాయి.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే టీ20 మ్యాచ్‌లో అత్యధిక పరుగుల రికార్డు 2016లో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో ఏకంగా 489 పరుగులు నమోదయ్యాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.