`దోపిడీ తేలికే.. కానీ.. దాయడమే కష్టంగా ఉంది!`.. ఓల్డ్ హిందీ సినిమాలో ఓ అవినీతి అధికారి డైలాగ్ ఇది! ఇప్పుడు కర్ణాటక లోని కీలక పొజిషన్‌లో ఉన్న ఒక అధికారి పరిస్థితి కూడా అచ్చుగుద్దినట్టు ఇలానే ఉంది. అధికారం(ఆయన పెద్ద ఉన్నతాధికారి) ఉంది కదా.. అని.. రెండు చేతలా కాదు.. నాలుగు చేతలా.. అన్నట్టుగా.. అడ్డంగా దోచేశాడు. బ్యాంకులు.. బంధువులు, చుట్టాలు.. పక్కాలు.. బీరువాలు.. లాకర్లు.. స్నేహితులు.. పరిచయస్తులు.. ఇలా.. అన్ని మార్గాల్లోనూ తను దోచుకున్న సొమ్మును భద్రంగా దాచేశాడు. అయినా.. ఇంకా మిగిలిపోయింది!.. అంటే.. జనాలను అంతగా పిండేశాడన్న మాట!! దీంతో ఆ సొమ్మును తన పడకగదిలో పెట్టుకున్నాడు. ఈ సొమ్ము అక్షరాలా 54 లక్షలకు పైగానే ఉంది.
ఇవన్నీ.. 500 రూపాయల నోట్ల కట్టలు. కొన్ని రోజులుగా బాగానే నడిచిపోయింది. కానీ.. కర్ణాటక సర్కారు.. రంగంలోకి దిగింది. త్వరలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. రాష్ట్రంలో అవినీతి కంపు తీవ్రంగా ఉందని.. ప్రజల నుంచి విమర్శలు వస్తుండడంతో కొరడా ఝళిపించింది. అంతే..! ఏముంది.. సదరు అధికారి అడ్డంగా దొరికిపోయాడు. అయినప్పటికీ.. డబ్బుపై వ్యామోహంతో అందిన కాడికి.. దాయగలిగిన కాడికి నొట్ల కట్టలను.. తలుపు మూలల్లో.. దేవుడి మందిరం అడుగు భాగంలో దాచాడు. అయినా.. మిగిలిపోయింది. దీంతో విధిలేక.. బాత్ రూం నుంచి వేస్ట్ వాటర్ ప్రవహించే గొట్టాల్లో నోట్లకట్టలను స్వయంగా దాచుకున్నాడు. అయినా.. చేసిన పాపం ఊరికే పోతుందా? అడ్డంగా.. బుక్కయ్యాడు.
కర్ణాటకలోని కలబురగి పీడబ్ల్యూడీ జేఈ శాంతగౌడ ఇంట్లో తనిఖీ కోసం వెళ్లారు ఏసీబీ సిబ్బంది. అతని ఇంటి డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు ఉన్నట్లు గుర్తించారు. ప్లంబర్ను పిలిపించి పైపు కట్ చేసి వాటిని బయటకు తీశారు. ఏసీబీ అధికారులను చూసి శాంతగౌడ 10 నిమిషాల పాటు తలుపులు తెరవలేదు. ఆ సమయంలోనే అతను డబ్బును డ్రైనేజీ పైపులో వేసి ఉంటాడని అధికారులు అనుమానించారు. ఈ విషయం తెలిసే తాము పైపు కత్తిరించినట్లు వివరించారు. డ్రైనేజీ పైపు నుంచి రూ.13 లక్షలు వెలికితీసినట్లు వెల్లడించారు. శాంతగౌడ ఇంట్లో మొత్తం రూ.54లక్షల అక్రమ నగదు, బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. రెండు లాకర్ల తాళంచెవులు ఇవ్వకుండా అధికారులను శాంతగౌడ ఇబ్బందిపెట్టాడు.
కర్ణాటకలో మొత్తం 15 మంది ప్రభుత్వ అధికారులకు సంబంధించి మొత్తం 60 చోట్ల ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు చేశారు. గడగ్ జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టీఎస్ రుద్రేషప్పకు చెందిన శివమొగ్గ నివాసంలో రూ.3.5కోట్లు విలువ చేసే 7.5 కేజీల బంగారం సీజ్ చేశారు. రూ.15లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంట్లో చేసిన సోదాల్లో 100 గ్రాముల గోల్డ్ బిస్కట్లు 60, 50 గ్రాములవి 8, కిలోన్నర ఆభరణాలు, డైమండ్ నెక్లెస్, 3 కేజీల వెండిని అధికారులు గుర్తించారు. అంటే.. అవినీతి తీవ్రత ఎలా ఉందో తెలుస్తోంది. అందుకే ప్రజలు కొన్నాళ్లుగా గగ్గోలు పెడుతున్నారు.