ప్రస్తుతం అంతా కరెంట్ కోతల కాలం నడుస్తోంది. నాలుగు వానలు పడితే మళ్లీ జల విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ పుంజుకునేందుకు వీలుంది. ఆ విధంగా విద్యుత్ సంక్షోభం నుంచి ఒడ్డెక్కవచ్చు.లేదంటే బొగ్గు నిల్వలు సరిపడినంత తెప్పించుకుంటే అదేలేండి విదేశాల నుంచి దిగుమతికి అవకాశం ఉంటే ఆ విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తే కొంత మేలు. కొంత ఉపశమనం కూడా కానీ ఇవేవీ కాకుండా పక్క రాష్ట్రాలు చూడండి.. ఇరుగును చూడండి పొరుగును చూడండి అని వైసీపీ నేతలు చెప్పడమే హాస్యాస్పదం.
ఎందుకంటే ఎలా చూసుకున్నా గత టీడీపీ సర్కారు వారి హయాంలో గత టీడీపీ పాలనలో కరెంటు సంక్షోభం అయితే లేదు. ఆ విధంగా చంద్రబాబును కాస్తో కూస్తో పొగిడి తీరాల్సిందే. కానీ జగన్ మాత్రం అప్రకటిత కోతల్లో రికార్డు స్థాయిలో తప్పిదాలు చేస్తూ ఉన్నారు. దీని ప్రభావం ఇప్పటికిప్పుడు లేకున్నా రేపటి వేళ అంటే ఎన్నికల వేళ తప్పక ఉంటుంది. తక్షణమే కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత సీఎం జగన్ దే!
కానీ సమస్యకు ఆర్థిక పరమైన వనరులు ఉండాలి. అక్కడే మళ్లీ తగాదా ముంచుకువస్తోంది. ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే బొగ్గు నిల్వల కొనుగోలు లేదా ఇప్పటికిప్పుడు ఝార్ఖండ్ లాంటి రాష్ట్రాలలో బొగ్గు గనుల తవ్వకాలకు అటు నుంచి ఇటు రవాణాకు వీటన్నింటికీ నిధులు కావాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఆఘమేఘాల మీద నిధులు చెల్లింపునకు సిద్ధంగా లేదు.
పంచాయతీలకు మొన్నటి వేళ నిబంధనల అనుసారం కేంద్రం నుంచి వచ్చిన పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేశారు అని వినికిడి. అంటే ఇప్పుడు మళ్లీ రెవెన్యూ లోటు ఉంది. విద్యుత్ లోటు ఉంది. విద్యుత్ లోటు తీర్చాలంటే ఆర్థిక లోటు ముందు పూడ్చుకోవాలి. ఇవన్నీ ఉంటుండగానే జగన్ మాత్రం క్యాబినెట్ విస్తరణ మార్పు వగైరా వగైరా పదాలతో జనాలను మరింత కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు.
ఈ సమయంలో మనల్ని ఆదుకునే నాథుడెవ్వరు? ఓ వైపు తెలంగాణ సర్కారు తరఫున శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి మోతాదుకు మించి జరిగిపోతుందన్న వాదనలు వస్తున్నాయి. మరో వైపు మిగులు విద్యుత్ తో ఉన్న రాష్ట్రం లేదా ఉండాల్సిన రాష్ట్రం కాళ రాత్రులను చవి చూస్తోంది.
ప్రజానీకం కష్టాలను అనుభవించాల్సి వస్తోంది. ఈ కాలంలో మీడియా రాతను నమ్ముతారా అంటే నమ్మాలి.. ఆధారాలున్నాయి కదా అందుకోసం అయినా సరే నమ్మాలి.