ప‌దేళ్ల‌లో 50 ల‌క్ష‌ల మంది.. తెలంగాణ ప్ర‌స్తుత జ‌నాభా ఎంతంటే!

Update: 2023-07-11 13:23 GMT
తెలంగాణ‌లో ప్ర‌స్తుత జ‌నాభా ఎంత‌?  అంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. 4 కోట్ల 10 ల‌క్ష‌ల మంది. ఈ విష‌యాన్ని కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది. అయితే.. వాస్త‌వానికి జ‌నాభా లెక్క‌ల‌ను కేంద్ర‌మే చేస్తుంది.

ప్ర‌తి ప‌దేళ్ల‌కు ఒక‌సారి లెక్కించే జ‌నాభా లెక్క‌లు ఈ సారి 2021లో చేయాల్సి ఉంది. కానీ, క‌రోనా నేప‌థ్యంలో వీటిని త‌దుప‌రి సంవ‌త్స‌రానికి వాయిదా వేశారు. కానీ, 2022లో స‌గ భాగం క‌రోనా ఇంకా కొన‌సాగ‌డంతోపాటు.. ప‌లురాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి.

దీంతో అప్ప‌ట్లోనూ జ‌నాభా లెక్క‌ల ప్ర‌క్రియ‌ వాయిదా ప‌డింది. ఇక‌, ఈ ఏడాది కూడా లేన‌ట్టే. వ‌చ్చే ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

ఇదిలావుంటే.. గ‌త చివ‌రి సారి చేసిన జ‌నాభా లెక్క‌ల మేర‌కు తెలంగాణ జ‌నాభా 3 కోట్ల 50 ల‌క్ష‌ల 3 వేల 674. దీనిని 2011లో చేశారు. అప్ప‌ట్లో చ‌ద‌ర‌పు కిలో మీట‌రుకు 312 నుంచి 320 మంది  జ‌నాభా ఉన్నారు. అయితే.. ఈ ప‌దేళ్ల‌లో మ‌రో 50ల‌క్ష‌ల మంది పైచిలుకు జ‌నాభా పెరిగిన‌ట్టు తెలుస్తోంది.

తాజాగా స‌ర్కారు లెక్క‌ల ప్ర‌కారం 4 కోట్ల 10 ల‌క్ష‌లుగా ఉన్న‌ప్పుడు.. గ‌త ప‌దేళ్ల‌లో 50 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు పెరిగార‌నే లెక్క స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక‌, నీతి ఆయోగ్ అంచ‌నా మేర‌కు తెలంగాణ సంతానోత్ప‌త్తి రేటు 1.6 గా ఉంద‌ని స‌మాచారం. అంటే.. ఒక‌ర‌కంగా జ‌నాభా పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది. వాస్త‌వానికి భార‌త దేశ సంతానోత్ప‌త్తి రేటు 2021 లెక్క‌ల ప్ర‌కారం 0.8 గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Similar News