విమానంలో సె*క్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన జంట... వీడియో వైరల్!

అవును... బ్యాంకాక్ నుంచి జ్యూరిచ్ కు వెళ్తున్న స్విస్ ఎయిర్ విమానంలో ఓ జంట లైంగిక కార్యకలాపాలకు తెరలేపింది.

Update: 2024-12-12 04:26 GMT

ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో జరుగుతున్న పలు సంఘటనలు అత్యంత అభ్యంతరకరంగా, జుగుప్సాకరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ జంట విమానంలోనే లైంగిక కార్యకలాపాలకు తెరలేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది!

అవును... బ్యాంకాక్ నుంచి జ్యూరిచ్ కు వెళ్తున్న స్విస్ ఎయిర్ విమానంలో ఓ జంట లైంగిక కార్యకలాపాలకు తెరలేపింది. ఈ విషయం కొంతమందికి షాకింగ్ గా అనిపించగా.. మరికొంతమందికి తీవ్ర ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. అయితే... వీరి కార్యక్రమాన్ని ఎయిర్ లైన్స్ సిబ్బంది వీడియో తీసి, షేర్ చేయడం మరో వివాదమైంది.

సెక్యూరిటీలో భాగంగా ఏర్పాటు చేసిన కాక్ పీట్ కంట్రోల్ కెమెరాల ద్వారా వీరి రాసలీలల కార్యక్రమాన్ని చిత్రీకరించి.. అనంతరం ఆ వీడియో ఫుటేజ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు! దీంతో... ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అటు జంట చేసిన పనితో పాటు, ఇటు సిబ్బంది చేసిన పనిని స్విస్ ఎయిర్ లైన్స్ ఖండించింది.

దీనిపై స్పందించిన స్విస్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి మెయిక్ ఫ్లూహ్ రోట్ స్పందిస్తూ... అనుమతి లేకుండా వ్యక్తులను చిత్రీకరించడం, రికార్డులను షేర్ చేయడం తమ విలువలు, డేటా రక్షణ చట్టాలను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా కాక్ పిట్ యాక్సెస్ ను పర్యవేక్షించడానికి మాత్రమే కెమెరాలు ఉన్నవని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఈ ఘటన విషయంలో సిబ్బంది నేరుగా జోక్యం చేసుకుని ఉండాల్సింది తప్ప.. ఇలా వీడియో రికార్డ్ చేసి, నెట్టింట వదలడం సరైన చర్య కాదని ఖండించారు. మరోపక్క ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారిందని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందిస్తున్న నెటిజన్లు... ఆ జంట చేసిన పనిపై ఫైరవుతున్నారు. ఇది పూర్తిగా సిగ్గులేని చర్యగా అభివర్ణిస్తున్నారు. ఇదే సమయంలో... ప్రయాణికుల ప్రైవసీపై దాడిగా విమానయాన సిబ్బంది చర్యను ఖండిస్తున్నారు.

Tags:    

Similar News