వైసీపీ సీనియర్లను కట్టడి చేస్తోంది ఎవరు ?

అదే సమయంలో యాక్టివ్ గా ఉన్నామని సంకేతాలూ ఇవ్వడం లేదు.

Update: 2025-02-02 03:37 GMT

వైసీపీలో సీనియర్లు చాలా మంది మౌన ముద్రలో ఉన్నారు. వారు బాహాటంగా అయితే తాము రాజకీయాల నుంచి తప్పుకున్నామని ఎక్కడా చెప్పడం లేదు. అదే సమయంలో యాక్టివ్ గా ఉన్నామని సంకేతాలూ ఇవ్వడం లేదు. సైలెంట్ గానే ఉన్నారు. అన్నీ గమనిస్తున్నారు. మరి రాజకీయ పరిభాషలో చెప్పాలంటే గోడ మీద పిల్లుల మాదిరిగా చాలా మంది ఉన్నారని వర్తమాన రాజకీయ పరిస్థితులను గమనిస్తూ తమకు అనుకూలమైన సమయానికి ఆ వైపునకు జంప్ చేస్తారు అని అంటున్నారు.

అయితే వైసీపీ సీనియర్లు పార్టీలో ఉన్నా లేనట్లుగా ఉన్నారు. అలా ఎందుకు జరుగుతోంది అంటే రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఉండడమే అంటున్నారు. కొంతమందికి ఉన్న పార్టీ నచ్చడం లేదు. అదే సమయంలో తాము అనుకున్న పార్టీల నుంచి పిలుపు రావడం లేదు. దాంతో ఏమి చేయాలో తెలియక వారు కొన్నాళ్ళ పాటు రెస్ట్ అని సన్నిహితులకు మాత్రం ఏదో తెలియని హింట్ ఇస్తున్నారుట.

మరి కొన్నాళ్ళ పాటు అంటే ఎన్నాళ్ళు అన్నది బహుశా వారికి కూడా తెలియదేమో అని సెటైర్లు పడుతున్నాయి. గతంలో ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణం ఇపుడు లేదు. టీడీపీలోకి పోవాలని చాలా మందికి ఉన్నా అక్కడ రాజకీయ విధానాలు పూర్తిగా మారిపోతున్నాయి. మొదటి నుంచి ఆ పార్టీలో ఉన్న సీనియర్లనే రెస్ట్ మోడ్ లోకి వెళ్ళమని అన్యాపదేశంగా పార్టీ పెద్దల నుంచి సూచనలు సంకేతాలూ వస్తున్నాయి. దాంతో ఏమి చేయాలో వారికే తెలియడం లేదు.

టీడీపీ అంతా యూత్ అని కలవరిస్తోంది. కొత్త నీరు కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. రేపటి కాలానికి జూనియర్ నేతలే తమకు కావాలని పట్టుబట్టి మరీ చెబుతోంది. అలాంటి వాతావరణంలో వైసీపీ నుంచి సీనియర్లుగా ఉన్న నేతలు వెళ్ళినా ఉపయోగం లేదని అంటున్నారు. అంతే కాదు వారికి పిలుపులు కూడా పెద్దగా ఉండటం లేదని అంటున్నారు.

చాలా మంది ఇటీవల కాలంలో వైసీపీకి రాజీనామాలు చేశారు. అందులో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా అయితే టీడీపీలో చేరాలనే అనుకున్నారు. కానీ అక్కడ డోర్ల్స్ క్లోజ్ అని అంటున్నారు. ఒక గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నుంచి దూరమైనా ఆయనకు ఇప్పటిదాకా టీడీపీలో చేర్చుకుంటామని పిలుపు రాలేదని అంటున్నారు.

ఇలా చూస్తే చాలా మంది ఈ తరహా నేతలు ఉన్నారు. కొంతమంది తమ వారసులకు అయినా చోటు ఇవ్వాలని కోర్తున్నా కూడా టీడీపీలో సీనియర్ల వారసులకే ప్లేస్ మెంట్స్ లేక ఇబ్బందిగా ఉన్న వాతావరణం అంటున్నారు. దాంతో ఇక చేసేది లేక కొంతమంది వైసీపీలోనే కంటిన్యూ అయితే పోలా అని ఒక రకమైన రాజీకు వస్తున్నారుట. మరి కొందరు అయితే ఇంకా వేచి చూసే ధోరణిలో ఉంటున్నారుట.

ఏది ఏమైనా టీడీపీలో యూత్ జపం కాస్తా ఇతర పార్టీలకు షాకింగ్ గా మారుతోంది. అందుకే జంపింగ్స్ ఆగిపోయాయని అంటున్నారు. మరి ఇది వాపో బలమో వైసీపీ అధినాయకత్వం తేల్చుకుని టీడీపీ మాదిరిగానే ఎక్కడికక్కడ యువతరాన్ని కొత్త వారిని ప్రోత్సహించడమే బెటర్ అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News