లోకేశ్ కు షాక్‌!...టీ స‌ర్కారు నోటీసులు రెడీ!

Update: 2019-03-05 06:28 GMT
రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌రోమారు తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మైన డేటా చోరీ కేసు ఈ రోజు కీల‌క మ‌లుపు తిగిరే అవాక‌శాలు క‌నిపిస్తున్నాయి. ఏపీ ప్ర‌జ‌ల‌కు చెందిన కీల‌క ఆధారాల‌న్నింటినీ చంద్ర‌బాబు స‌ర్కారు... టీడీపీకి అనుకూలంగా వ్య‌హ‌రిస్తున్న ఓ ఐటీ సంస్థ‌కు అంద‌జేసింద‌ని, ఓ ప్రైవేటు సంస్థ వ‌ద్ద ఇలా ప్ర‌జ‌ల వివ‌రాల‌న్నీ ఉంటే ప‌రిస్థితి ఏమిట‌న్న వాద‌న వినిపిస్తున్న నేప‌థ్యంలో ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారిపోయింది. అంతేకాకుండా ఈ విష‌యంలో వైసీపీ నేత‌ల నుంచి ఫిర్యాదు అందుకున్న సైబ‌రాబాద్ పోలీసులు విచార‌ణ జ‌రుపుతుండ‌గా... ఆ ద‌ర్యాప్తును అడ్డుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం య‌త్నిస్తుండ‌టం - దీనిపై నేరుగా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు - ఆయ‌న కుమారుడు - మంత్రి నారా లోకేశ్ స్వ‌యంగా స్పందిస్తున్న తీరుపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తుతోంది. త‌మ పార్టీకి సేవ‌లందిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎక్క‌డ ఇబ్బందుల పాలవుతుందోన‌న్న అనుమానం కంటే కూడా ఈ మొత్తం వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డితే... త‌మ భాగోతం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌న్న భ‌యంతోనే చంద్ర‌బాబు - లోకేశ్ లు స్వ‌యంగా రంగంలోకి దిగిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే... ద‌ర్యాప్తు జ‌రుగుతున్న తీరును ప‌రిశీలిస్తే... నేడు ఈ కేసులో కీల‌క మ‌లుపు చోటుచేసుకునే అవకాశాలున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఏపీ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ కు నోటీసులు పంపేందుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ద‌ర్యాప్తులో తేలిన సంచ‌ల‌న విష‌యాల క్ర‌మంలోనే లోకేశ్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఏపీ ప్ర‌భుత్వం వ‌ద్ద భ‌ద్రంగా ఉండాల్సిన ప్ర‌జ‌ల డేటా వివ‌రాల‌న్నీ... నేరుగా లోకేశ్ కార్యాల‌యం నుంచే ఐటీ గ్రిడ్ సంస్థ‌కు అందిన‌ట్లుగా సైబ‌రాబాద్ పోలీసులకు ప‌క్కా ఆధారం దొరికిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఐటీ గ్రిడ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న టీ పోలీసులు... ఆ సంస్థ అధిప‌తి అశోక్ కోసం వేచి చూస్తున్నారు. అయితే త‌న అరెస్ట్ త‌ప్ప‌ద‌న్న భావ‌న‌తోనే ఏపీకి పారిపోయిన అశోక్‌... ఏపీ పోలీసుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఓ సేఫ్ జోన్‌ లో ఉన్న‌ట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అశోక్ స్వ‌యంగా లొంగిపోవాల‌ని - లేని ప‌క్షంలో ఎక్క‌డున్నా అరెస్ట్ చేసి తీర‌తామ‌ని ఇప్ప‌టికే సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌న్నార్ వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అశోక్ త‌మ ముందుకు వ‌స్తే గానీ.. ఈ కేసు ఓ కొలిక్కి వ‌స్తుంద‌న్న భావ‌న‌ను వ్య‌క్తం చేసిన స‌జ్జ‌న్నార్‌.. త‌న‌కు ఈ వివ‌రాలు ఎవ‌రి ద్వారా అందాయి? ఎవ‌రు ఈ వివ‌రాల‌ను తీసుకోమ్మ‌న్నారు? అస‌లు ఈ వివ‌రాల‌తో ఏం చేయాల‌ని ప్లాన్ చేశారు? అన్న వివ‌రాలు అశోక్ నోరిప్పితేనే వెలుగులోకి వ‌స్తాయి. అయితే అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం - ఏపీ ప్ర‌భుత్వ‌మే అత‌డికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తోంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో తెలంగాణ పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా సాగుతున్నారు. త‌మ ద‌ర్యాప్తులో తేలిన వివ‌రాల మేరకే లోకేశ్ కే నేరుగా నోటీసులు జారీ చేస్తే సరి అన్న కోణంలో తెలంగాణ పోలీసులు భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం. ఇదే జరిగితే... లోకేశ్ తో పాటు ఏపీలో అధికార టీడీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News