ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాను అల్లకల్లోలం చేస్తున్న తితలీ తుఫాను కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తితలీని సీతాకోకచిలుకగా అభివర్ణిస్తారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం.. విజయనగరం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోనికొన్ని జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. తుఫాను కలిగించిన నష్టం భారీగా ఉన్నట్లు చెబుతున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన వారిలో ఆరుగురు మరణించగా.. ఇల్లు కూలి ఒకరు.. చెట్లు కూలి మరొకరు మృతి చెందినట్లుగా చెబుతున్నారు.
ముందుగా ఊహించినట్లే తితలీ తుఫాను భారీ నష్టాన్ని మిగిల్చింది. తుఫాను తీరం దాటే సమయంలో పెను గాలుల తాకిడికి ఆస్తి నష్టం భారీగా వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో భారీ ఎత్తున వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పలాస.. వజ్రపుకొత్తూరు.. నందిగాం మండలాల్లో 28.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. తర్వాతి స్థానం కోటబొమ్మాళిలో 24.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం.. విజయనగరంలో జిల్లాల్లో అత్యల్పంగా కురిసిన వర్షపాతం అంటే గార మండలంలో 4.02 సెంటీమీటర్లుగా చెబుతున్నారంటే వర్ష తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. తితలీ పెనుతుఫాను ఈ రోజు తెల్లవారుజామున పలాస వద్ద తీరం దాటినట్లుగా వాతావరణ కేంద్ర పేర్కొంది. తుఫాను తీరం దాటినప్పటికీ పెను తుఫాను కొనసాగుతూనే ఉంది. ఇది ఈశాన్య దిశగా పశ్చిమ బంగా వైపుకదిలి.. క్రమేపి బలహీనపడి రేపటికి మామూలు తుఫానుగా మారే అవకాశం ఉందంటున్నారు. తితలీ తీరం దాటినా శ్రీకాకుళం.. విజయనగరం జిల్లాల్లో పెనుగాలులు వీస్తున్నాయి. ఇదే పరిస్థితి రేపు ఉదయం వరకూ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
పెనుగాలులు.. తీవ్రంగా కురిసిన వర్షం కారణంగా శ్రీకాకుళం జిల్లాల్లో చాలాచోట్ల విద్యుత్.. కమ్యునికేషన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింది. ఫోన్లు పని చేయని పరిస్థితి. దీంతో.. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తమ వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో బయట ప్రపంచానికి అర్థం కాని పరిస్థితి. దీంతో.. తీవ్ర ఆందోళన నెలకొంది.సిగ్నల్స్ వ్యవస్థ దెబ్బ తినటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగోతంది. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున (అక్టోబరు 11-12) హుదూద్ విశాఖ జిల్లాను వణికించగా.. తాజాగా తితలీ శ్రీకాకుళం.. విజయనగరం జిల్లాలను భారీగా దెబ్బ తీసింది.
శ్రీకాకుళం జిల్లాలోని వివిధ మండలాల్లో గురువారం మధ్యాహ్నానానికి నమోదైన వర్షపాతం..
+ పలాస.. వజ్రపుకొత్తూరు -. నందిగాం: 28.02 సెం.మీ
+ కోటబొమ్మాళి: 24.82 సెం.మీ
+ సంతబొమ్మాళి: 24.42సెం.మీ
+ ఇచ్ఛాపురం : 23.76 సెం.మీ
+ టెక్కలి: 23.46 సెం.మీ
+ సోంపేట, మందస: 13.26సెం.మీ
+ కవిటి : 12.44 సెం.మీ
+ పొలాకి: 9.74 సెం.మీ
+ జలుమూరు: 9.06 సెం.మీ
+ ఎల్ఎన్‌పేట: 8.92 సెం.మీ
+ నరసన్నపేట: 6.04 సెం.మీ
+ పొందూరు: 5.8 సెం.మీ
+ లావేరు: 4.94 సెం.మీ
+ శ్రీకాకుళం: 4.62 సెం.మీ
+ రణస్థలం: 4.58 సెం.మీ
+ ఎచ్చెర్ల: 4.48 సెం.మీ
+ బూర్జ: 4.28సెం.మీ
+ గార: 4.02సెం.మీ