ఎలా అయినా సరే తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకోవటమే లక్ష్యమన్నట్లుగా పావులు కదుపుతోంది బీజేపీ. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయటంతో పాటు.. అధికారపక్షాన్ని దెబ్బ తీసి.. ప్రత్యామ్నాయంగా ఎదగటానికి అవసరమైన సాధనా సంపత్తిని సమకూర్చుకుంటున్న పార్టీ.. ఇతర పార్టీల్లోని నేతల్ని తమ పార్టీలోకి చేర్చుకుంటోంది.
సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీస్థానాల్ని సొంతం చేసుకున్న నాటి నుంచి తెలంగాణలో తమకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయన్న ఆశ బీజేపీ అధినాయకత్వానికి సొంతమైంది. తమకెంతకూ కొరుకుడుపడని సౌత్ లో పాగా వేసే అవకాశం లభిస్తే అంతకు మించిన సంతోషం ఆ పార్టీకి మరొకటి ఉండదు. 2023లో జరిగే జమిలి ఎన్నికల నాటికి తెలంగాణ అధికారపక్షానికి ప్రత్యామ్నాయంగా పార్టీని మార్చాలన్న గట్టి పట్టుదలతో బీజేపీ వ్యూహకర్తలు ఉన్నారు.
ఇందుకు తగ్గట్లే తెలంగాణకు చెందిన పలువురు నేతలు బీజేపీగూటికి వస్తున్నారు. దీంతో.. రాష్ట్రంలో ఇప్పుడా పార్టీ సందడిగా మారింది. తెలంగాణ అధికారపక్షాన్ని గట్టిగా నాలుగు మాటలు అనలేని స్థానం నుంచి.. తూర్పార పట్టే వరకూ ఎదిగిందని చెప్పాలి. గతంలో టీఆర్ఎస్ మీదా.. ఆ పార్టీ అధినేత మీద ఏదైనా విమర్శ చేస్తే అయితే సింగిల్ కాలమ్.. లేదంటే డబుల్ కాలమ్ వరకే ఇచ్చేస్థాయి నుంచి.. ఇప్పుడు మొదటి పేజీలో బ్యానర్ వార్తగా మారిన పరిస్థితి.
కాలానికి తగినట్లుగా.. నేతలు పార్టీలు మారటం ఇప్పుడు నడుస్తున్న సీజన్. దీనికి తగ్గట్లే ఇప్పుడు పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు అంటరాని పార్టీగా కనిపించిన బీజేపీ.. ఇప్పుడు చాలామంది నేతల ఆశల పల్లకిగా మారింది. ఇదిలా ఉంటే.. రాజ్యసభ సభ్యుడు.. గడిచిన కొంతకాలంగా టీఆర్ఎస్ లో ఉన్న డి. శ్రీనివాస్ తాజాగా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన కుమారుడు కమ్ ఎంపీ అరవింద్ క్లారిటీ ఇచ్చేశారు.
తన తండ్రి డి.శ్రీనివాస్ ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరిచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. తనను నమ్మి బీజేపీలోకి చేరుతున్న డీఎస్ అనుచర వర్గానికి తాను అండగ ఉంటానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మీద సంచలన విజయాన్ని సాధించటం ద్వారా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన అరవింద్.. తాజాగా కొత్త నినాదాన్ని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. నిజామాబాద్ పేరు ఉండటాన్ని ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారని.. దాని స్థానే జిల్లాకు ఇందూరు పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి తండ్రి పార్టీ మారటాన్ని కొడుకు క్లారిటీగా చెప్పేశారని చెప్పాలి.