శశికళ విడుదలపై తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Update: 2020-07-11 15:00 GMT
అవినీతి కేసులో జైలు పాలైన జయలలిత స్నేహితురాలు.. అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నాయకురాలు త్వరలో జైలు నుంచి విడుదల అవుతున్నారనే వార్త తమిళనాడు రాజకీయాలను పూర్తిగా ఉత్కంఠగా మారుతున్నాయి. ఆగస్టులో ఆమె విడుదల అవుతారని బీజేపీ తమిళనాడు నాయకుడు పేర్కొనప్పటి నుంచి ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు తాజాగా శశికళ విడుదలపై తమిళనాడు మంత్రి స్పందించారు.

శశికళ విడుదలై వచ్చినా అన్నాడీఎంకే పార్టీలో.. ప్రభుత్వంలో శశికళకు స్థానం లేదని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ ప్రకటించారు. అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ విడుదలపై శనివారం మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఈ విధంగా మాట్లాడారు. శశికళ వ్యవహారంలో ఇదివరకే అన్నాడీఎంకే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆమె జైలు నుంచి ఎప్పుడు విడుదలైనా పార్టీలో చోటులేదని, ఒక కుటుంబం మినహాయించి మిగతా వారంతా అన్నా డీఎంకేలో చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. శశికళ వ్యవహారంలో మంత్రి ఓఎస్‌ మణియన్‌ కూడా స్పందించారు. ఆమె పార్టీలో చేరడంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Tags:    

Similar News