డీఎస్‌ కు క్యాబినెట్ ప‌ద‌వి ద‌క్కిందోచ్‌

Update: 2015-08-21 07:47 GMT
న‌మ్మి వ‌చ్చిన వారికి పెద్ద‌పీట వేయ‌టం.. పార్టీలో ఎప్ప‌టి నుంచో కాచుకొని ఉన్న‌వారికి మొండిచెయ్యి చూపించ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ కు అల‌వాటే. ఆ విష‌యం మ‌రోసారి రుజువైంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాధినేత‌గా వ్య‌వ‌హ‌రించిన డీఎస్ లాంటి వ్య‌క్తి కేసీఆర్ చెంత‌న చేర‌టం చాలామందికి రుచించ‌లేదు.

అంత‌పెద్ద డీఎస్‌.. కేసీఆర్ వ‌ద్ద‌కు వెళ్ల‌టం ఏమిట‌ని చాలామంది అనుకున్నారు. అంత‌పెద్ద డీఎస్ త‌మ‌తో క‌ల‌వ‌టాన్ని కేసీఆర్ సైతం ఆనందం వ్య‌క్తం చేయ‌ట‌మేకాదు.. డీఎస్ ఎంత పెద్ద‌మ‌నిషో త‌మ‌కు తెలుస‌ని.. ఆయ‌న్ను అలానే స‌త్క‌రిస్తామ‌ని చెప్పారు. కేసీఆర్ నోట నుంచి వ‌చ్చిన మాట కావ‌టంతో.. డీఎస్‌ కు ఇచ్చే ప‌ద‌వి ఎలా ఉంటుంద‌న్న ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. రోజులు గ‌డుస్తున్నా ప‌ద‌వి ఏమీ ఇవ్వ‌క‌పోవ‌టంతో డీఎస్‌కు కేసీఆర్ దెబ్బేశార‌ని ఎత్తిపొడిచినోళ్లు ఉన్నారు.

త‌న‌ను న‌మ్మి పార్టీలోకి వ‌చ్చిన వారికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అన్యాయం చేయ‌ని కేసీఆర్‌.. అందుకు త‌గ్గ‌ట్లే తాజా నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ మ‌ధ్య పార్టీలో చేరి డీఎస్‌ కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక స‌ల‌హాదారుగా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. క్యాబినెట్ హోదా ఉన్న ఈ ప‌ద‌వితో డీఎస్‌ కు ఎలాంటి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న స‌స్పెన్స్ తీరిపోయింది. అదే స‌మ‌యంలో.. డీఎస్‌ కు మంత్రి కావాల‌న్న కోరిక తీరిపోయింది. మొత్తానికి ఉభ‌య‌తారకం ఈ వ్య‌వ‌హారం ముగియ‌ట‌మే కాదు.. పార్టీని విడిచి పెట్టి వ‌చ్చే వారికి మ‌రింత పెద్ద‌పీట వేస్తామ‌న్న సందేశాన్ని కేసీఆర్ తాజా ఉత్త‌ర్వుతో చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు అయ్యింది.
Tags:    

Similar News