టీఆర్ ఎస్ పార్టీలో - తెలంగాణ రాజకీయాల్లో గత కొద్దికాలంగా చర్చనీయాంశంగా మారిన టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ కుమారుడు బీజేపీలో చేరడం విషయంలో పూర్తి స్పష్టత వచ్చేసింది. మూడు వారాల క్రితమే అరవింద్ తాను కమలం గూటికి చేరుతున్నట్టుగా ఆయన స్పష్టమైన సంకేతాలు వెలువరించి సంగతి తెలిసిందే. పంద్రాగస్టు వేడుక సందర్భంగా ప్రధాని మోడీని కీర్తిస్తూ భారీ ఎత్తున పత్రికా ప్రకటన (అడ్వర్టయిజ్ మెంట్) ఇవ్వడం ద్వారా తాను కాషాయ కండు వా కప్పుకునే యోచనలో ఉన్నట్టు అరవింద్ చెప్పకనే చెప్పారు. అరవింద్ ఇచ్చిన పత్రికా ప్రకటన ఇటు జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. దీనికి చాలారోజుల ముందు నుండే అరవింద్ బీజేపీ ముఖ్య నేతలతో సంప్రదింపుల పర్వం కొనసాగిస్తూ వచ్చారని స్పష్టమవుతోంది. కాగా , బీజేపీలో చేరుతున్న విషయమై అరవింద్ ను మీడియా సంప్రదించగా - వాస్తవమేనని ఆయన నిర్ధారించారు.
ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ బీజేపీలో చేరడం ఖాయమని తెలిపిన అరవింద్ ఎప్పుడు ఎక్కడ చేరాలనేది అనేది కేంద్ర నాయకత్వమే నిర్ణయిస్తుందన్నారు. తాను స్వతంత్రంగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. పార్టీలో చేరడం గురించి మా నాన్న తో సంప్రదించే అవసరం ఏముందని అరవింద్ ఎదురు ప్రశ్నించారు. ``నాకు నలభయ్యేళ్లు. స్వతంత్రంగానే ఆలోచించి, నిర్ణయం తీసుకున్నాను. బీజేపీలో నేను చేరడం వల్ల మా నాన్న డి.శ్రీనివాస్ కు టీఆర్ఎస్‌లో ఎలాంటి ఇబ్బంది ఉంటుందని నేను అనుకోను`` అని అన్నారు.2002 నుంచే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం తనను బీజేపీ పట్ల ఆకర్షితుడిని చేసిందన్నారు. బీజేపీతో అనుబంధం తన కుటుంబ మూలాల్లోనే ఉందని డీఎస్ తనయుడు అరవింద్ అన్నారు. ఇప్పటికిప్పుడు తన వెంట ఎంతమంది అనుచరులు, అభిమానులు తరలివస్తారనేది చెప్పలేనప్పటికీ, తాను పార్టీలో చేరిన అనంతరం పెద్ద సంఖ్యలోనే బీజేపీలోకి వలసలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.