‘వైజాగ్ లోని స్టీలుప్లాంట్ అభివృద్ధికి కేంద్రం అన్నీ చర్యలు తీసుకుంటోంది’..ఇది తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పిన మాటలు. స్టీలు ప్లాంటులో అవసరమైన మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేయటంతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్రప్రభుత్వం అన్నీరకాలుగా సాయం చేస్తోందని పురంధేశ్వరి చెప్పారు. ఇక్కడే ఈమె మాటలు చాలా విచిత్రంగా ఉంటోంది.
ఒకవైపేమో స్టీలు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు చాలా స్పీడుగా జరిగిపోతున్నాయి. ప్లాంటును కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్న ప్రముఖ సంస్ధలు ప్లాంటును రెగ్యులర్ గా సందర్శిస్తున్నాయి. ప్లాంటులో ఉత్సత్తవుతున్న స్టీలును, డెవలప్ చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై సాంకేతిక అధికారులతో ప్రైవేటు యాజమాన్యాలు చర్చలు జరుపుతున్నాయి. ఫ్యాక్టరీకి సంబంధించిన అన్నీ ఇన్ పుట్లను ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాయి.
కళ్ళముందు జరుగుతున్న ప్రైవేటీకరణ ప్రక్రియను ప్లాంటులోని కార్మిక, ఉద్యోగుల సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గడచిన ఆరుమాసాలుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్లాంట్లను విభాగాల వారీగా విడదీసి ప్రైవేటీకరణ చేయటానికి వీలుగా బిడ్డింగులను ఆహ్వానిస్తు ప్లాంటు యాజమాన్యం పేరుతో మీడియాలో భారీ ప్రకటనలు కూడా వచ్చాయి. జరుగుతున్నది జనాలందరు గమనిస్తునే ఉన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గేది లేదని కేంద్రమంత్రులు పార్లమెంటులోనే స్పష్టంగా నాలుగుసార్లు ప్రకటించారు. ప్లాంటు అమ్మకం సాధ్యంకాకపోతే మూసేస్తామని కూడా కేంద్రమంత్రులు చెప్పిన విషయం అందరు చూశారు. మరిలాంటి పరిస్దితుల్లో స్టీల్ ప్లాంటు ప్రైవేటుపరం కాదని మాత్రం పురంధేశ్వరి చెప్పలేదు. పైగా సాంకేతికంగా అభివృద్ధి చేస్తుందని సొల్లు చెబుతున్నారు.
మొదటినుండి స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో బీజేపీ నేతలు అబద్ధాలే చెబుతున్నారు. స్టీలు ఫ్యాక్టరీ విషయంలో ఒక్కోనేత ఒక్కోవిధంగా మాట్లాడి జనాల్లో అయోమయం క్రియేట్ చేస్తున్నారు. ప్లాంటు ప్రైవేటీకరణను ఆపటం వీళ్ళల్లో ఎవరివల్లా కాదని అందరికీ తెలిసిందే. నరేంద్రమోడి స్ధాయిలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని మార్పించటం వీళ్ళవల్ల కాదని తమకూ తెలుసు. అయినా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.