బాబు వల్ల పోలవరం 15 ఏళ్లు ఆలస్యం

Update: 2017-04-21 10:00 GMT
పోలవరం నిర్మాణం పూర్తి చేయడం తన కల అని నిత్యం చెప్పే ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై ఆయన తోడల్లుడు - ఏపీ రాజకీయాల్లో సీనియర్ లీడర్ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్య  చేశారు. మాట్లాడితే చాలు చంద్రబాబు పోలవరం తన కల అంటూ కలరింగ్ ఇస్తున్నారని... నిజానికి ఆయన వల్లే పోలవరం ఇంత ఆలస్యం అయిందంటూ ఆయన గత చరిత్ర చెప్పుకొచ్చారు.

పోలవరం పట్ల చంద్రబాబు గతంలో చంద్రబాబు సరిగ్గా స్పందించకపోవడం వల్లనే ఎప్పుడో పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ ఇలాగే ఉందన్నారు.  1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో పోలవరంపై ఉన్నతస్థాయి సమావేశం జరిగిందని చెప్పారు. ఆ మీటింగ్‌ లో అప్పటి మంత్రి ఎర్రన్నాయుడు కూడా పాల్గొన్నారన్నారు. పోలవరానికి అన్ని అనుమతులు, అన్ని విధాల సాయం చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందని దేవేగౌడ చెప్పారని...  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాజెక్టుకు సంబంధించి నివేదిక కోరామని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని దేవేగౌడ చెప్పారన్నారు.  దేవేగౌడ సూచనను అప్పట్లో చంద్రబాబు మాత్రం పట్టించుకోలేదని దగ్గుబాటి చెప్పారు. పోలవరం నిర్మాణం కోసం చంద్రబాబు ఎలాంటి వివరాలు పంపలేదన్నారు.
   
ఆరోజు చంద్రబాబు పంపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. దేవేగౌడ ప్రధానిగాఉన్న సమయంలో చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతుండేవారు. కాబట్టి ఆరోజే చంద్రబాబు స్పందించి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తిఅయ్యేదన్న మాట. 1997 వరకు దేవగౌడ అధికారంలో ఉన్నారు. అప్పుడు వేగవంతమైనా కనీసం ఒక అయిదేళ్ల టైం తీసుకున్నా 2002 నాటికైనా ఒక కొలిక్కి వచ్చేది. అంటే దగ్గుబాటి లెక్క ప్రకారం చంద్రబాబు కారణంగా పోలవరం ప్రాజెక్టు 15 సంవత్సరాలు ఆలస్యమైందనుకోవాలి.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News