ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వద్దన్నారని దగ్గుబాటి గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు మాత్రం అంతా తానే కడుతున్నానని చంద్రబాబు అంటున్నారు. `చంద్రబాబును చూస్తే జాలేస్తోంది. సీఎం సీట్లో నేను ఉండి ఉంటే.. గంట కూడా కూర్చోలేను` అని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారని దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు. అప్పట్లో పోలవరం గురించి పోరాడుతున్న యర్రా నారాయణస్వామిని మందలించారని ఆరోపించారు. గతంలోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం అనుమతులిచ్చిందని చెప్పారు. అప్పుడు వద్దన్న చంద్రబాబు, ఇప్పుడు మొత్తం తానే కడుతున్నానని గొప్పలకు పోతున్నారని దగ్గుబాటి ఘాటుగా విమర్శించారు.
వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని దగ్గుబాటి మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనే బాధ్యతను ఇంటెలిజెన్స్ ఐజీకి అప్పగించారు. పార్టీలో ఉన్న అసంతృప్తులకు కాంట్రాక్టులు కట్టబెడతామంటూ ఐజీ ప్రలోభపెడుతున్నారు. సదరు ఆ పోలీసు అధికారి ఆస్తులు కొనుగోలు, అమ్మకాలపై జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి దీక్షలు చేయడం కరెక్టా?. పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. చంద్రబాబు ఆ అంశాన్ని పట్టించుకోలేదు. అప్పటి స్పీకర్ మీరాకుమార్‌కు పురందేశ్వరి విజ్ఞప్తి చేయడంతో ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంట్‌లో పెట్టే అవకాశం లభించిందని దగ్గుబాటి అన్నారు.
రాజకీయాలు వద్దనుకున్నానని చెప్పుకున్న దగ్గుబాటి.. ప్రశాంతంగా రిటైర్ అవ్వాలనుకున్నానని వివరించారు. అందుకే హితేషును రాజకీయాల్లోకి తెస్తున్నామని స్పష్టం చేసారు. తాను వివిధ పార్టీలు మారిన మాట వాస్తవమేనని అంగీరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అయితే అధికారంలో లేని పార్టీల్లోకే వెళ్లానని గుర్తు చేసారు. ఒకే కుటుంబంలో ఉంటూ భిన్నమైన పార్టీల్లో ఉండడం కొత్తేమీ కాదని.. కొంతమంది కావాలనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇందిరా గాంధీ కాంగ్రెస్.. ఫిరోజ్ గాంధీ సోషలిస్ట్ పార్టీ అని గుర్తు చేశారు. బీజేపీ-వైసీపీ పొత్తుల గురించి తనకేమీ తెలీదని వ్యాఖ్యానించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పొత్తుల విషయంలో ఏది నిజమో కొన్నాళ్లాగితే తేలుతుందన్నారు.
మహానాయకుడు సినిమాలో చూపినట్టు.. ఏ ఎమ్మెల్యే పైనే అటాక్ చేయలేదని దగ్గుబాటి తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలంతా వాలంటరీగానే వచ్చారని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యేలను తరలించిన ట్రైనులో తానూ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రామాయపట్నం పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సహకారం లభించడం లేదన్నది వాస్తవమన్నారు.