మారిన జీవనశైలి పుణ్యమా అని వీర్యం నాణ్యత అంతకంతకూ తగ్గిపోతున్న వైనం తెలిసిందే. మారిన జీవన శైలి.. అంతకంతకూ పెరుగుతున్న ఆహారపద్ధతులతో పాటు.. మరికొన్ని అంశాలు వీర్యం నాణ్యత మీద సందేహాలు పెంచేలా ఉంటున్నాయి. దీని కారణంగా పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టకపోవటం. . సంతాన లేమితో తెగ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.
ఇలాంటివేళ.. తాజాగా జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. వీర్యం క్వాలిటీని మరింత పెంచుకునే అవకాశం ఎవరికి వారికి వారి.. వారి చేతుల్లోనే ఉందన్న వైనం బయటకు వచ్చింది. నిత్యం యోగా చేయటం ద్వారా వీర్యం నాణ్యతను మరింత పెంచుకోవచ్చని చెబుతున్నారు.
శుక్రకణాల్లో డీఎన్ ఏ దెబ్బ తినటం కారణంగా సంతాన సమస్యలు చుట్టుముడుతుంటాయి.ఇలాంటి సందర్భాల్లో శిశువుల్లో జన్యపరమైన వ్యాధులు.. అనారోగ్య సమస్యల ముప్పులూ చుట్టుముడుతుంటాయి. డీఎన్ ఏలు దెబ్బ తినటానికి ఆక్సీకరణ ఒత్తిడే కారణంగా చెబుతున్నారు.
లిక్కర్ తీసుకోవటం లాంటి వాటి కారణంగా శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్‌రీ రాడికల్స్ మధ్య సమతౌల్యం దెబ్బ తింటుందని.. అయితే.. దీనికి విరుగుడుగా నిత్యం యోగా చేయటం.. జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో సమస్య అధిగమించొచ్చని చెబుతున్నారు. వీర్యం నాణ్యతలో సమస్యలు ఎదుర్కొంటున్న 200 మంది పురుషుల మీద జరిపిన అధ్యయనం తాజా విషయాన్ని వెల్లడించింది.
నాణ్యత లోపించిన 200 మంది పురుషుల చేత నిత్యం యోగా చేయించటం మొదలుపెట్టారు. ఆర్నెల్ల పాటు యోగా చేయించటం ద్వారా వీరి నాణ్యతలోనూ మార్పులు వచ్చినట్లుగా గుర్తించారు. సో.. యోగాతో ఆరోగ్యమే కాదు.. పవర్ ఫుల్ వీర్యం తయారీకి సాయం చేస్తుందన్నమాట.