తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ చిచ్చు ఇంకా రగులుతోంది. సీనియర్ నేత - మాజీ మంత్రి పుష్పరాజ్ పేరును పక్కనపెట్టి టీజీ వెంకటేశ్ కు టికెట్ ఇవ్వడంపై దళిత నేతలు ఫైర్ అవుతున్నారు. ఎస్సీ - ఎస్టీ బీసీ - మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ‘వర్దమాన రాజకీయాల్లో దళితులపై జరుగుతున్న వివక్ష’ అనే అంశంపై సదస్సు నిర్వహించి ఈ సందర్భంగా టీడీపీ తీరుపై ఫైర్ అయ్యారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు దళితులను అనేక సార్లు మోసం చేశాయని, అదే దారిలో తెదేపా కూడా దళితులను నమ్మించి మోసం చేసిందని దళిత బహుజన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు ఆరోపించారు.
రాజ్యసభకు ఎన్నిక కావాలంటే డబ్బు - కులం కావాలని.. అందుకే సీఎం చంద్రబాబు పార్టీలో సీనియర్ అయిన మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ ను కాకుండా పార్టీ మారి వచ్చిన టి.జి.వెంకటేష్ కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి దళితులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆయనకు దళితులు సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసమని, ఆయన చరిత్ర చూస్తే మొదటిగా మామను వెన్నుపోటు పొడిశారని, తర్వాత ఎమ్మార్పీఎస్ ను నమ్మించి మోసం చేశారని, ఇప్పుడు పార్టీని నమ్ముకుని నీతి నిజాయతీతో పనిచేసిన నాయకుడు జేఆర్ పుష్పరాజ్ ను కాదని రాజ్యసభ సీటును టీజీ వెంకటేష్ కు కట్టపెట్టారని విమర్శించారు. ఇప్పటికైన సీఎం చంద్రబాబు జేఆర్ పుష్పరాజ్ కు సముచిత స్థానం కల్పించి గౌరవించాలని డిమాండ్ చేశారు. పుష్పరాజ్ కు రాజ్యసభ రాకుండా టీజీకి బెర్త్ దక్కేలా మధ్యవర్తిగా ఉన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు - చంద్రబాబు నాయుడికి దళితులు రానున్న రోజుల్లో తప్పకుండా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.