గ్రేటర్ మేయర్ గద్వాల్ కు అండగా నిలిచిన దానం.. ఏం చెప్పారంటే?

Update: 2021-02-16 05:30 GMT
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా ప్రమాణ స్వీకారంమాత్రమే చేసి.. ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మీ తాజాగా షేక్ పేట తహసిల్దార్ ను బదిలీ చేశారన్న ఆరోపణలు బలంగా వినిపించటం తెలిసిందే. పదవిని చేపట్టారో లేదో.. తన ప్రతాపాన్ని కేకే కుమార్తె చూపించినట్లుగా విమర్శలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే.. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయర్ స్పందించలేదు.

షేక్ పేట ఎమ్మెర్వోకు గద్వాల విజయలక్ష్మికి మధ్య నెల క్రితం గొడవ జరగటం తెలిసిందే. దీంతో.. ఆయన బదిలీ కావటంతో అందరి వేళ్లు గద్వాల విజయలక్ష్మీ మీద పడ్డాయి. ఇలాంటివేళ.. ఆమెకు దన్నుగా నిలిచేందుకు మాజీ మంత్రి కమ్ సీనియర్ నేత దానం నాగేందర్ దన్నుగా నిలిచారు. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారశైలి ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉందన్నారు.

ఓవైపు 75గజాల లోపు స్థలాల్లో అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు పేదల బస్తీల్లో ఇళ్లనను కూల్చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల ఇబ్బందుల్ని అర్థం చేసుకొని వారికి అండగా నిలవటంప్రజా ప్రతినిధుల బాధ్యతగా చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఫోన్లు చేస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం సరికాదన్నారు. ఆదాయ.. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం జరుగుతుందని.. అందుకు కిందిస్థాయి అధికారుల అవినీతే కారణమని చెప్పారు. ఏమైనా.. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న హైదరాబాద్ మేయర్ కు దానం దన్నుగా నిలవటం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News