బర్త్ డే పార్టీలో నగ్నంగా చిందులు.. చివరకు షాకింగ్ ట్విస్ట్

Update: 2021-11-04 06:20 GMT
పార్టీ అనగానే మందేస్తూ చిందేయడం వెరీ కామన్. ఈ మధ్య ఆడ మగ అనే తేడా లేకుండా పార్టీల్లో పబ్బుల్లో తాగి ఊగేస్తున్నారు. బర్త్ డే పార్టీకి పిలవగానే ఎగేసుకుంటూ ఇద్దరు యువకులు వెళ్లారు. పిలిచింది స్నేహితులే కదా అని నమ్మి వెళ్లారు. మందు, అమ్మాయిలు, చిందులు ఉంటాయని ఆశపడ్డారు. కానీ వారు అనుకున్నది ఒక్కటి అక్కడ జరిగింది మరొకటి. అదే తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మనోళ్లకు మద్యం మత్తులో వారి స్నేహితులే వారికి శత్రువులయ్యారు. డబ్బు కోసం నీచానికి పాల్పడ్డారు. అసలు ఆ పార్టీలో ఏం జరిగిందో తెలుసుకొని వారంతా బోరుమన్నారు.

మీరట్ కు చెందిన ఇద్దరు యువకుడు స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లారు. అక్కడ ఫుల్లుగా మందు కొట్టారు. రెండు బాటిళ్లు కడుపులో పడగానే స్నేహితులు విశ్వరూపం చూపించారు.

ఈ ఇద్దరు యువకుల బట్టలను బలవంతంగా విప్పించి నగ్నంగా డ్యాన్స్ చేయాలని బలవంతం పెట్టారు. ఆ తర్వాత వారిద్దరి మధ్యకు మరో యువతిని నగ్నంగా పంపి వారితో సరసాలు ఆడించారు. ఈ ఘటనను వీడియోలు తీశారు.

అనంతరం ఆ వీడియోలు చూపించి వారిని లక్షలు ఇవ్వాలని స్నేహితులే డిమాండ్ చేశారు. లేకపోతే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఏం చేసినా లాభం లేదనుకొని వారితో డీల్ మాట్లాడుకొని ఆ వీడియోలను డిలీట్ చేయించి ఇంటికి చేరుకున్నారు.

ఇక ఈ వార్త విన్న నెటిజన్లు అవాక్కయ్యారు. ఫ్రీ మందుకని వెళితే బట్టలు విప్పి బరివాత ఆడించారా? అని నవ్వుకుంటున్నారు.
Tags:    

Similar News