ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఒక్కో చోట ఒక్కోలా మారింది. కొన్ని ప్రాంతాల్లో కొంతమేర కట్టడి కాగా మరి కొన్ని ప్రాంతాల్లో గతం లో మాదిరే అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో కరోనా ఉధృతి కొంతమేర తగ్గినప్పటికీ ఇంకా కొన్ని జిల్లాలు డేంజర్ జోన్ లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా తెలిపింది. చాలా రాష్ట్రాల్లో కరోనా తగ్గినప్పటికీ కొన్ని చోట్ల ఇంకా ఈ మహమ్మారి కంట్రోల్ కావడం లేదని పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా ప్రభావిత జిల్లాల లిస్ట్ ను విడుదల చేసింది. ఏపీ లో ఇంకా ఐదు జిల్లాల్లో కరోనా కేసులు భయందోళన కు గురి చేస్తున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా మంగళవారం 46,790 కొత్త కేసులు నమోదయ్యాయి. 10,32,795 మందికి కరోనా పరీక్షలు నిర్వహించిననట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 67 శాతం కేవలం 6 రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో టాప్-5 జిల్లాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల్లో ఈ వైరస్ ఉద్ధృతి అధికంగా అందులో ఏపీలో 5 జిల్లాలు ఉన్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగానే ఉందని కేంద్రం తాజా గణాంకాల్లో వెల్లడించింది. ఏపీలో మునుపటితో పోలిస్తే కరోనా తగ్గింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఏపీతో పాటు మహారాష్ట్రలోని ముంబై, పుణే, థానే, నాగ్‌పూర్, అహ్మద్‌నగర్, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు అర్బన్, మైసూర్, తుమకూరు, దక్షిణ కన్నడ, హసన్ కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం, కోలికోడ్, తిరువనంతపురం, మళప్పురం, త్రిస్సూర్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, 24 ఉత్తర పరగణాస్, 24 దక్షిణ పరగణాస్, హావ్‌డా, హుగ్లీ. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు, సేలం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో కరోనా కేసులు గణనీయంగానే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా ప్రభావిత ప్రాంతాల వారు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.