'మనోవర్తి'కి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు.. అది భర్తకు శిక్ష కాదు!!

ఈ రెండింటిలోనూ తన ఆవేదనను వెళ్లడిస్తూ.. న్యాయమూర్తి ప్రస్థావన తీసుకొచ్చారు.

Update: 2024-12-12 07:38 GMT

భార్య వేదింపులు తట్టుకోలేక అతుల్ సుభాష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ముందు సుభాష్ ఏకంగా 24 పేజీలకు పైగా లేఖ రాయడంతో పాటు.. సుమారూ 80 నిమిషాల వీడియోనూ చిత్రీకరించాడు. ఈ రెండింటిలోనూ తన ఆవేదనను వెళ్లడిస్తూ.. న్యాయమూర్తి ప్రస్థావన తీసుకొచ్చారు.

అవును... ఉత్తరప్రదేశ్ కు చెందిన అతుల్ సుభాష్ బెంగళూరులోని ఓ కంపెనీలో ఐటీ డైరెక్టర్ గా పని చేస్తూ మారతహల్లీలోని మంజునాథ లే అవుట్లో ఉంటున్నారు. ఈ సమయంలో భార్య వల్ల తాను మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో.. అతుల్ సోదరుడు, బాబాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... "భరణం ఇవ్వకపోతే చచ్చిపోవచ్చు అని న్యాయస్థానంలో జడ్జి ఎదుటే భార్య అతనిడి అనడం.. దీనికి న్యాయమూర్తి నవ్వడం సుభాష్ ను తీవ్రంగా బాదించిందని" అతని బంధువులు ఆంగ్ల మీడియాకు వెల్లడించారు. ఈ విషయాన్ని అతుల్ సుభాష్ తన సూసైడ్ నోట్ లోనూ ప్రస్థావించారని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన సుభాష్ సోదరుడు... తన సోదరుడికి న్యాయం జరగాలని.. ఈ దేశంలోని చట్ట ప్రక్రియ నుంచి పురుషులకు కూడా న్యాయం అందాలని.. ఈ కేసులోని న్యాయమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. మెల్లగా న్యాయవ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతొందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో... తాము ఏటీఎం యంత్రాల్లా మారిపోతామనే భావనతో పెళ్లిళ్లు అంటేనే పురుషులు భయపడే పరిస్థితి దారితీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు సుభాష్ బాబాయ్ మాట్లాడుతూ... అతడి భార్య తర్పువారు నిత్యం డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారని.. అతడి సామర్థ్యం మేరకు కుమారుడు పోషణకు డబ్బులు ఇచ్చాడని.. తొలుత వారు రూ.40 వేలు డిమాండ్ చేయగా.. తర్వాత దాన్ని రెట్టింపు చేశారని.. చివరకు నెలకు రు.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు.

ప్రధానంగా.. భరణం ఇవ్వకపోతే చచ్చిపోవచ్చు అని న్యాయస్థానంలో జడ్జి ఎదుటే భార్య ఆతడిని అనడం.. దానికి న్యాయమూర్తి నవ్వడం సుభాష్ ను అత్యంత తీవ్రంగా బాధించిందని ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్ల కుమరుడిని అడ్డుపెట్టుకుని అతడిని డబ్బు ముద్రించే యంత్రంలా మార్చేశారని పేర్కొన్నారు.

మరోవైపు సుభాష్ తో పాటు అతని కుటుంబంపైనా అతడి భార్య నిఖితా కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తన అత్త కట్నం కోసం వేధించిందని.. తనను తన భర్త మద్యం తాగి వచ్చి కొట్టేవాడని.. తనను ఓ పశువులా చూసేవాడని చెబుతూ.. అత్తగారి వేధింపుల కారణంగానే తన తండ్రి ఆరోగ్యం దెబ్బతిని మరణించారని చెప్పుకొచ్చారు.

కాగా... అదనపు కట్నం కోసం డిమాండ్ చేయడం వల్ల తన తండ్రి షాక్ తో మరణిచించాడని నికిత తొలుత పేర్కొనగా.. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో మాత్రం తన తండ్రి హత్య ఆరోపణలు తప్పు అని ఆమె అంగీకరించిందని.. ఆమె తండ్రి ఎప్పటినుంచో ఉన్న గుండె సంబంధిత వ్యాధి కారణంగా మరణించాడని ఒప్పుకుందని అంటున్నారు.

భరణం మంజూరులో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు!:

ఇప్పుడు బెంగళూరు టెకీ అతుల్ సుభాస్ ఆత్మహత్య కేసుపై దేశవాప్తంగా చర్చ జరుగుతుందని అంటున్నారు. మరోపక్క ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తిపైనా సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమయంలో భరణం మంజూరులో పరిగణలోకి తీసుకోవాల్సిన 8 పాయింట్ల ఫార్ములాను సుప్రీంకోర్టు ప్రకటించింది!

1. భార్యభర్తల సామాజిక, ఆర్థిక స్థితి

2. భవిష్యత్తులో భార్య, పిల్లల ప్రాథమిక అవసరాలు

3. ఇరు పక్షాల విద్యార్హత, ఉద్యోగం

4. ఇరు పక్షాల ఆదాయం, ఆస్తుల మూలాలు!

5. వివాహ బంధంలో ఉన్న వేళ ఆ మహిళ అనుభవించిన జీవన ప్రమాణాలు

6. కుటుంబ బాధ్యతల కోసం ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసిందా?

7. పని చేయని భార్య న్యాయ పోరాటం కోసం తగిన మొత్తం

8. భర్త ఆర్థిక స్థితి, సంపాదన, నిర్వహణ భత్యం, ఇతర బాధ్యతలు ఎలా ఉంటాయి?

వంటి విషయాలను భరణం మంజూరులో పరిగణలోకి తిసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా మనోవర్తి చెల్లించడం ఏ భర్తకూ శిక్ష కారాదని.. అలాగే భార్య సగౌరవంగా జీవించేలా ఉండాలని పేర్కొందని తెలుస్తోంది!!

Tags:    

Similar News