తెలంగాణ లో కరోనా మహమ్మారి జోరు చాలా ఉదృతంగా కొనసాగుతుంది. ఈ మహమ్మారి సెకండ్ వేవ్ దెబ్బ కి హాస్పిటల్స్ బెడ్స్ మొత్తం నిండిపోతున్నాయి. అయితే , ప్రభుత్వం మాత్రం మరోలా చెప్తుంది. కానీ ప్రభుత్వం చెప్పే మాటలకి , క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. రోజూ కొత్తగా వందమంది రోగులు ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లపైకి వచ్చి చేరుతున్నారు అంటే కరోనా తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి 12 రోజుల వ్యవధిలో ఏకంగా 1000కి పైగా కేసులు వాటిపైకి వచ్చాయి. అలాంటి రోగులు కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతోంది. గత ఐదు రోజులుగా రాష్ట్రంలో రోజుకు సగటున 2800 వరకు కేసులు నమోదు అవుతున్నాయి.
ఏప్రిల్ 1న ఐసీయూ, వెంటిలేటర్లపై ప్రభుత్వ, ప్రైవేటులో 979 మంది ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 2120కి పెరిగింది. దీన్ని బట్టి చూస్తే..12 రోజుల్లో కొత్తగా 1141 మంది ఆ పడకలపైకి చేరారు. సర్కారీ లెక్కల ప్రకారం వస్తున్న కేసుల్లో రోజూ 95 మంది వరకు ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లల్లో చేరుతున్నారు. అంటే నమోదవుతున్న కేసుల్లో 3.57 శాతం మందికి ఆ పడకలు అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1711, ప్రైవేటులో 3480 ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయి. వాటిపై 2120 మంది రోగులుండగా మరో 3071 పడకలు ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ పడకలపై వచ్చేవారిలో 60 పైబడిన వారు 30-34శాతం ఉంటే, 50-60 మధ్య 20-25 శాతం మంది, 40-50 మధ్య 20 శాతం మంది, 40లోపు 25-30 శాతం మంది ఉంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. కరోనా కేసుల ఉధృతి ఇలాగే పెరిగితే నెల రోజుల్లోనే ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లన్నీ నిండిపోయే అవకాశం ఉంది.
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండే రోగులు ఐసీయూకు, పరిస్థితి విషమించిన రోగులు వెంటిలేటర్ పైకి వెళ్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్లన్నింటికీ వెంటిలేటర్లను అందుబాటులో ఉంచారు. ఒకసారి రోగి వెంటిలేటర్ పైకి వస్తే ఎన్ని రోజులు చికిత్స అవసరమవుతుందో చెప్పలేని పరిస్థితి. కొందరు నెల రోజులు కూడా వెంటిలేటర్లపై ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ఇక వెంటిలేటర్‌పైకి వెళ్లే ప్రతి 10మందిలో ఆరేడుగురే కోలుకుంటారని , 3-4 మరణాలు సంభవించే అవకాశం ఉంది.