వైరస్ ధాటికి మానవ జాతి గిలగిల : కోటికి చేరువలో కేసులు

Update: 2020-06-23 06:45 GMT
కనిపించని ఓ వైరస్ మొత్తం మానవ జాతిపైనే విలయతాండవం చేస్తోంది. అందరినీ కాటేస్తూ తన బలం పెంచుకుంటూ పోతుండడంతో మానవ ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ వైరస్ తీవ్రంగా ప్రబలుతూనే ఉంది. ఆ వైరస్ ఏ స్థాయిలో ఉందంటే ఏకంగా కోటి కేసులు త్వరలోనే నమోదయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు భూగోళంపై నమోదైన కేసులు 91,92,712. ఇంకో 8 లక్షలు నమోదవుతే కోటి దాటనున్నాయి.

యావత్ మానవజాతిని ఈ వైరస్ పట్టి పీడిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది లొంగడం లేదు. విరుగుడు కనిపెడితేనే ఆ వైరస్ అంతం సాధ్యం. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 91,92,712 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4,74,445 మంది వైరస్ బారిన పడి మృత్యు వాత పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న వారు 4,939,382.

గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో ఏకంగా 1,38,975 కేసులు, 3,880 మరణాలు సంభవించాయి. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటంతో కొంచెం ఊరట చెందే విషయం. ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్, స్పెయిన్,బ్రిటన్, రష్యాతో భారతదేశం లో వైరస్ తీవ్రం గా ఉంది. వైరస్ కట్టడికి అస్త్రంగా ప్రయోగించిన లాక్ డౌన్ దశల వారీగా ఎత్తి వేస్తున్నారు. ఇదే వైరస్ పుంజుకోవడానికి కారణ మవుతోంది. కొన్ని దేశాల్లో కొంత మేరకు సామూహిక వ్యాప్తి కూడా చెందుతోంది.

అమెరికాలో అత్యధిక కేసులు(23,88,153), మరణాలు(1,22,610) నమోదయ్యాయి. బ్రెజిల్ లో పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలు దాటగా.. 51 వేలకుపైగా మరణాలు సంభవించాయి. రష్యాలో 592,280 పాజిటివ్ కేసులు, 8,206 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 4,40,215 నమోదు కాగా, మృతుల సంఖ్య 14,011కి చేరింది. త్వరలోనే భారత్ లో 8 లక్షల దాక కేసులు నమోదవుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News