లేటెస్ట్ అప్డేట్ : ఒక్కరోజే 18,522 కేసులు..418 మరణాలు

Update: 2020-06-30 05:45 GMT
భారత్‌లో వరుసగా ఆరో రోజు 15 వేలకుపైగా మహమ్మారి పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. సోమవారం నుండి మంగళవారం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 18,522 కేసులు నమోదయ్యాయి. ఇలాగే 418 మంది వైరస్  బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 5,66,840కి, మరణాలు 16,893కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం మహమ్మారియాక్టివ్‌ కేసులు 2,15,125 కాగా, 3,34,822 మంది బాధితులు చికిత్సతో కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.  

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మహమ్మారి కేసులు సంఖ్య వేలల్లో రికార్డ్ అవుతున్నాయి . మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ప్రతిరోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ చాపకింద నీరులా మెల్లమెల్లగా ఈ  వైరస్ విస్తరిస్తున్నది. రాష్ట్రంలో మహమ్మారికేసులు విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్ ‌ని మరో నెల రోజుల పాటు పొడిగించింది. లాక్ ‌డౌన్‌ ఈనెల30న ముగుస్తోండడంతో జూలై 31 వరకు లాక్ ‌డౌన్ ‌ని పొడిగిస్తున్నట్టు చీఫ్‌ సెక్రటరి కార్యదర్శి అజయ్‌ మెహతా ప్రకటించారు.

మహారాష్ట్ర బాటలోనే తమిళనాడు ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ను పొడగిస్తునట్టు ప్రకటించింది. ఇదే బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే లాక్ డౌన్ విధించి 100 రోజులు పూర్తీ కావడం ఆన్ లాక్ 1 పూర్తీ కావడంతో ..నేడు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ  జాతిని ఉద్దేశించి ప్రసగించనున్నారు.  ఇప్పటికే  వైరస్ కట్టడికి కంటెయిన్‌ మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్ ‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది.
Tags:    

Similar News