లేటెస్ట్ అప్డేట్ : దేశంలో మరో 55,079 పాజిటివ్‌ కేసులు

Update: 2020-08-18 11:30 GMT
భారత్ ‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.  దేశంలో కేసుల సంఖ్య 27 లక్షల 02 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 55,079 కేసులు నమోదు కాగా, 876 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 57,937 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో మొత్తం 27,02,742 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,73,166 ఉండగా, 19,77,779 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 51,797 మంది కరోనా వ్యాధితో మరణించారు.

ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 73.18 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.92 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 24.91 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో 8,99,864 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,09,41,264కి చేరింది. ఇక మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్‌లో పాజిటివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం కేసులు 6 లక్షలు దాటాయి. ప్రపంచంలో ప్రతి 10 లక్షల మందిలో కరోనా వల్ల 100 మంది దాకా చనిపోతున్నారు. ప్రస్తుతం మొత్తం కేసుల్లో ఇండియా, అమెరికా, బ్రెజిల్ తరవాత, మూడో స్థానంలో ఉంది. రోజువారీ కేసుల్లో భారత్ 14 రోజులుగా టాప్ పొజిషన్‌లో ఉంది. మొత్తం మరణాల్లో ఇండియా అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత నాలుగో స్థానంలో ఉంది. 10 రోజుల్లో మెక్సికోని వెనక్కి నెట్టి మూడోస్థానంలోకి వెళ్లేలా ఉంది. రోజు వారీ మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది.
 
ఇక , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 6,780 కొత్త కేసులు నమోదు అయ్యాయి.రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 2,93,714. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,732. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,06,205 కి చేరింది.

 ఇక , తెలంగాణ రాష్ట్రంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.  కొత్తగా 1,682 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 08 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 93,937కి చేరింది. మృతుల సంఖ్య 711కి పెరిగింది. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 72,202కి చేరింది. ప్రస్తుతం 21,024 మంది చికిత్స పొందుతున్నారు.
Tags:    

Similar News