దేశంలో తగ్గని కరోనా జోరు .. ఒక్కరోజే 1,092 మంది మృతి

Update: 2020-08-19 05:45 GMT
భారత్ లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. కరోనా కేసులు పెరిగేకొద్ది, మరణాల ఉద్ధృతి కొనసాగుతోంది. భారత్‌ లో 24 గంటల్లో 64,531 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,092 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా మహమ్మారి కేసుల సంఖ్య  27,67,274కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 52,889 కి పెరిగింది. ఇక 6,76,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,37,871 మంది కోలుకున్నారు. ఇండియాలో మరణాల రేటు 1.9 శాతంగా ఉంది. ప్రపంచంలో ఇది 3.5 శాతంగా ఉంది. అలాగే  రికవరీ రేటు దేశంలో 73.6 శాతంగా ఉంది.

దేశంలో కరోనా టెస్టులు బాగా పెంచారు. నిన్న ఒక్కరోజే 801518 టెస్టులు జరిగాయి. మొత్తం టెస్టులు 31742782కి పెరిగాయి.  టెస్టుల సంఖ్య పెంచే కొద్ది కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక , ప్రస్తుతం మొత్తం కేసుల్లో భారత్ , అమెరికా, బ్రెజిల్ తరవాత, మూడో స్థానంలో ఉంది. రోజువారీ కేసుల్లో భారత్ 15 రోజులుగా టాప్ ‌లో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, అమెరికా ఉన్నాయి. మొత్తం మరణాల్లో ఇండియా అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత నాలుగో స్థానంలో ఉంది.

ఇక ,తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,763 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1789 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,700కు చేరింది.  మృతుల సంఖ్య మొత్తం 719కి చేరింది.

ఇక , ఏపీలో కరోనా రక్కసి ప్రభావం తీవ్రంగా ఉంది. కొత్తగా 9,652 మందికి కరోనా నిర్ధారణ అయింది.  వీటితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261కి పెరిగింది.  తాజాగా 88 మంది మృత్యువాత పడ్డారు. దీనితో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,820కి పెరిగింది.
Tags:    

Similar News