భారత్ లో కరోనా మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి. సరిగ్గా ఏడు నెలల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షలు దాటిపోయింది. కరోనా ను అరికట్టే వ్యాక్సిన్ కోసం అన్ని దేశాల నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ , ఈ కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చేలా లేదు. ఇకపోతే , దేశంలో తాజాగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 86,432 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 40,23,179కి పెరిగింది. అలాగే తాజాగా గత 24 గంటల్లో 1089 మంది చనిపోవడంతో, మొత్తం మరణాల సంఖ్య 69561కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.7 శాతంగా ఉంటే.. ప్రపంచ దేశాల్లో అది 3.28 శాతంగా ఉంది. ఇకపోతే , గత నాలుగు రోజులుగా ఇండియాలో రోజూ వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి.
ఇండియాలో 24 గంటల్లో కరోనా నుంచి 70072 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఒకే రోజులో ఇంత మంది రికవరీ అవ్వడం భారత్‌లో ఇదే తొలిసారి. మొత్తం రికవరీల సంఖ్య 31,07,223కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 8,46,395 ఉంది. ఇక , నిన్న ఇండియాలో 1059346 శాంపిల్ టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 4,77,38,491కి పెరిగింది. వరుసగా ఐదు రోజులుగా ఇండియాలో రోజూ 10లక్షలకు పైగా టెస్టులు చేస్తున్నారు.
తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో ఏకంగా 2,511 కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,38,395కు పెరిగింది. నిన్న ఒక్క రోజే 11 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 877కు చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 305 కేసులు వెలుగుచూశాయి. తాజాగా కరోనా మహమ్మారి నుండి 2,579 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,04,603 మంది కరోనా కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 32,915 కేసులు యాక్టివ్ గా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించింది.
ఇక , ఏపీ విషయానికొస్తే .. గత కొన్నిరోజులుగా నిత్యం పది వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. గడచిన 24 గంటల్లోనూ కొత్తగా 10,776 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో 76 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,76,506కి చేరగా, మరణాల సంఖ్య 4,276కి పెరిగింది. తాజాగా 12,334 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ మహమ్మారి నుంచి 3,70,163 మంది కోలుకున్నారు. ఇంకా 1,02,067 మంది చికిత్స పొందుతున్నారు.