మాకు లాక్​డౌన్​ వద్దంతే..! ఊపందుకున్న ఉద్యమం

Update: 2020-10-09 05:30 GMT
కరోనా ఎఫెక్ట్​తో ప్రపంచదేశాలన్నింటికి లాక్​డౌన్​ తప్ప మరో మార్గం లేదు. అయితే ఈ లాక్​డౌన్​తో ఎంతోమంది యువత నష్టపోయారు. ఉపాధి కోల్పోయారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్​డౌన్​పై కొంతకాలంపాటు ప్రజలెవరూ అడ్డుచెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ‘మాకు ఈ లాక్​డౌన్​ వద్దు ఏమీ వద్దు, ఉపాధి కోల్పోతున్నాం. చిన్నచిన్న వ్యాధులు వచ్చినా ఆస్పత్రికి వెళ్లలేకపోతున్నాం. దయచేసి లాక్​డౌన్​ ఎత్తేయండి’ అంటూ యువతతోపాటు ఆరోగ్య నిపుణులు గొంతెత్తుతున్నారు. సోషల్​మీడియాలోనూ చాలా మంది ఈ తరహా పోస్టులు పెడుతున్నారు. ప్రజల నుంచి కూడా ఈ తరహా పోస్టులకు అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొటున్నామని సాగుతున్న అంతర్జాతీయ ఉద్యమానికి క్రమంగా మద్దతు పెరుగుతున్నది. సైంటిస్టులు, ఆరోగ్యనిపుణులు సైతం మద్దతు తెలపడం గమనార్హం.

లాక్​ డౌన్​ నిబంధనలతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లాక్​డౌన్​తో ఇతర ఆరోగ్యసమస్యలు.. అంటే గుండె సబంధిత వ్యాధులు, క్యాన్సర్​ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సకాలంలో వైద్యం అందడం లేదని.. చిన్నచిన్న వ్యాధులు వచ్చేవారు కూడా ఆస్పత్రికి వెళ్లలేక సమస్యను తీవ్రం చేసుకుంటున్నారని భవిష్యత్​లో ఇది మరింత దారుణ పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  బ్రిటన్​ కు చెందిన నిపుణులు 'గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్' పేరిట ఈ ప్రకటన చేశారు.

టీవీ డాక్టర్లు ఫిల్ హామండ్, రోజ్‌మరీ లియోనార్డ్ సహా బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్‌లో ఉన్న చాలామంది సీనియర్ వైద్యులు హెల్త్ సెక్రటరీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖలోని అంశాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. బ్రిటన్​ నిపుణులు లాక్ ​డౌన్​ కు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాదనలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. ఆ ప్రకటనలో ఏముందంటే.. లాక్​డౌన్​ నిబంధనలు బలహీనులకు శాపంగా మారాయి. లాక్​డౌన్​ నిబంధనల వల్ల దీర్ఘకాలిక సమస్యలున్నవారు పెరుగుతున్నారు. దీనివల్ల భవిష్యత్​ లో మనందరికీ ముప్పు వాటిళ్లుతుంది. ఇలా తదితర సమస్యలను వారు ప్రస్తవించారు.  

గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్ ఉద్యమం ఎక్కడ మొదలైంది..

నిజానికి ఈ ఉద్యమం అమెరికాలో మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 6 వేల మంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.. 50 వేల మంది ఇతరులు సంతకాలు చేశారు. - ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎపిడమాలజిస్ట్  డాక్టర్ సునేత్ర గుప్తా,   నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయ సెల్ఫ్ హార్మ్ ఎక్స్‌పర్ట్  ప్రొఫెసర్ ఎలెన్ టౌన్‌సెండ్, ఎడినబరో యూనివర్సిటీ డిసీజ్ మోడలర్ డాక్టర్ పాల్ మెక్‌గీ వంటి నిపుణులు సంతకాలు పెట్టిన వారిలో ఉన్నారు. లాక్​డౌన్ ​కు ప్రత్యామ్నాయంగా వారు కొన్ని సూచనలు చేస్తున్నారు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న చోట్ల లో పనికి అనుమతించాలని కోరుతున్నారు. పాఠశాలలు, యూనివర్సిటీలు తెరవాలని చెబుతున్నారు. అయితే వీరి ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News