దేశంలో కరోనా జోరు..1.35 లక్షలు దాటిన కరోనా మరణాలు!

Update: 2020-11-26 08:30 GMT
కరోనా మహమ్మారి జోరు ఇంకా కొనసాగుతుంది. ఒక రోజు కరోనా కేసులు తగ్గినట్టు కనిపిస్తున్నా , ఆ తర్వాత మళ్లీ పెరుగుతున్నాయి. భారత్ ‌లో కొత్త కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 44,489 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 92,66,706 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 36,367 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల సమయంలో 524 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో దేశంలో  మృతుల సంఖ్య 1,35,223 కి పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,79,138 మంది కోలుకున్నారు. 4,52,344 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌ లలో చికిత్స అందుతోంది కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 13,59,31,545 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,90,238 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 93.66 శాతంగా ఉంటే.. యాక్టివ్ కేసులు 4.88 శాతంగా ఉన్నాయని.. మరణాల రేటు 1.46 శాతంగా నమోదు అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Tags:    

Similar News