130 కోట్ల భారత్ లో వ్యాక్సిన్ పంపిణీ.. అంత ఈజీ కాదా?

Update: 2020-11-27 08:50 GMT
కరోనా వైరస్ ను నిరోధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యాక్సిన్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలో మూడో దశ ప్రయోగాలు కూడా విజయవంతంగా పూర్తి చేశాయి. ఇక వ్యాక్సిన్ పంపిణీయే తరువాయి అన్నట్లుగా పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ‘ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా’ ముందు వరుసలో ఉంది.  ఈ వ్యాక్సిన్ ఇప్పటికే అన్ని రకాల ప్రయోగాలు చేసి పంపిణీకి సిద్ధం చేసినా తాజాగా మరోసారి పరీక్షించనున్నట్లు వెల్లడించింది. అయితే భారత్ లోనూ హైదరాబాద్ కు చెందిన ‘భారత్ బయోటిక్’ కరోనా నివారణ వ్యాక్సిన్ ను విజయవంతంగా పరీక్షించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వ్యాక్సిన్లు వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. దీంతో కరోనా వ్యాక్సన్ ను భారత్ లో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్ వ్యాక్సిన్ కోసం రష్యా, అమెరికా సంస్థలతో ఒప్పందం చేసుకుంది.  వైరస్ కట్టడి కోసం 50 కోట్ల డోసులను ఉపయోగించాలని భారత్ వ్యూహం రచిస్తోంది.

భారత్ లో ఇతర వ్యాధులు రాకుండా చిన్నపిల్లలకు, గర్భిణులకు రకరకాల టీకాలు వేస్తుంటారు. దాదాపు 39 కోట్ల వ్యాక్సిన్లు ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు. అలాగే వ్యాక్సిన్లు నిల్వ చేయడానికి రకరకాల పద్ధతుల్లో కోల్డ్ స్టోరేజీ సెంటర్లు ఉన్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ భారత్ లో పంపిణీ చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారే అవకాశం ఉంది.

ఇండియాలో వ్యాక్సన్ వస్తే ముందుగా వారియర్స్ కే ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇది అంత తేలిక కాదంటున్నారు. వ్యాక్సిన్ ముందుగా వైద్యులకు ఇస్తామని తెలిపారు. కానీ ప్రైవేట్ సిబ్బందికా..? లేక ప్రభుత్వ సిబ్బందికా..? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇక మరణాల్లో ముందుండే వృద్ధులకు ఇస్తారా..? లేక చిన్న పిల్లలకా..? అనే సందేహం కూడా కలుగుతోంది. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదు. దీంతో ఏ రాష్ట్రానికి ముందుగా ఇస్తారోనన్న అనుమానం కులుగుతోంది.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని నాయకులు తెలిపారు. అయితే బీజేపీ రాష్ట్రాల్లో ముందుగా ఇస్తారా..? అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఒకేసారి అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయాలన్న వ్యాక్సిన్ డోసులతో పాటు వాటికి అవసరమయ్యే సిరంజీలు, ఇతర పరికాలను కూడా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో వ్యాక్సిన్ పంపిణీ అంత ఆషామాషీ కాదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Tags:    

Similar News