వ్యాక్సిన్​ అందరికీ అక్కర్లేదు.. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన.. మండిపడుతున్న విపక్షాలు..!

Update: 2020-12-02 02:30 GMT
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​ షాకింగ్​ ప్రకటన చేశాడు. దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్​ ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఎంపిక చేసిన వాళ్లకు మాత్రమ ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించాడు. రాజేశ్​ భూషణ్​ వ్యాఖ్యలు ఇటు ప్రజల్లో, అటు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. రాజేశ్​ భూషన్​ ఏమన్నారంటే.. ‘ ప్రతి ఒక్కరికీ టీకా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భారీగా వ్యాక్సినేషన్​ నిర్వహించాలి. అంతేకానీ ప్రతిమనిషికి ఇవ్వాల్సిన అవసరం లేదు.

కరోనా వ్యాప్తిని దేశంలో అరికట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. టీకా సమర్థత ఆధారంగా వ్యాక్సినేషన్​ మీద ఓ నిర్ణయం తీసుకుంటాం. సీరం ఇన్​స్టిట్యూట్​ తయారు చేస్తున్న వ్యాక్సిన్​పై ఇప్పడైతే దుష్ప్రభావాలు ఏమీ లేవు’ అంటూ రాజేశ్​ భూషణ్​ వ్యాఖ్యానించారు. అయితే కేంద్రప్రభుత్వం తీరును విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్​ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

బిహార్​ ఎన్నికల సమయంలో ప్రజలందరికీ వ్యాక్సిన్​ ఇస్తామని ప్రకటించిన మోదీ సర్కార్​ ఇప్పుడు మాట మారుస్తున్నదని వాళ్లు ఆరోపిస్తున్నారు.రెండ్రోజులు దేశవ్యాప్తంగా పర్యటించి వ్యాక్సిన్​ పరిస్థితిని గమనించినట్టు ప్రధాని నరేంద్రమోదీ షో చేశారని వాళ్లు విమర్శించారు. కరోనా వ్యాక్సిన్​ను రాజకీయాల కోసం వాడుకున్న బీజేపీ.. ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నదని ఆరోపించారు.
Tags:    

Similar News