‘కొత్త వైరస్’ ఇండియాకు వచ్చేసిందా..! ఢిల్లీ, కోల్ కతాలో టెన్షన్.. టెన్షన్..!
బ్రిటన్‌లో వ్యాపించిన కొత్తరకం కరోనా వైరస్‌తో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నది. కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఇక అందరూ సేఫ్ అనుకుంటున్న తరుణంలో బ్రిటన్‌లో పుట్టికొచ్చిన కొత్తరకం వైరస్ గుబులు పట్టిస్తోంది. ఇప్పటికే యూరప్‌లోని పలుదేశాలు బ్రిటన్ నుంచి రాకపోకలు నిలిపివేశాయి. మనదేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా అలెర్ట్ అయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్లను 14 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉంచి ఆ తర్వాత కరోనా పరీక్షలు చేశాకే ఇంటికి పంపించనున్నారు.
అయితే బ్రిటన్ నుంచి వచ్చిన ఎనిమిది మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఐదుగురికి, కోల్ కతాలో ఇద్దరికి, చెన్నైలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరంతా యూకే నుంచి వచ్చారు. అయితే వీరికి సోకింది కొత్త రకం కరోనా నే అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయంపై అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే శాంపిళ్లను ల్యాబ్ లో పరిశోధనకు పంపించారు. గత రాత్రి యూకే నుంచి ప్రయాణికులు భారత్ వచ్చినట్టు సమాచారం. కొత్తవైరస్పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలర్టయ్యింది. ఆయా రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటకలో జనవరి 5 వరకు కర్ఫ్యూ విధించారు. రాత్రి వేళ కర్ఫ్యూ కొనసాగించనున్నట్టు ఆయా రాష్ట్రాల అధికారులు తెలిపారు. ‘VUI-202012/01’ పేరుతో కరోనా వైరస్ వేరియంట్ యూకేలో విజృంభిస్తోంది.