భారతదేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతూవస్తుంది. సెకండ్ వేవ్ విజృంభణ తోలి రోజుల్లో నాలుగు లక్షలకి పైగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే , ఆ సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా కరోనా మహమ్మారి కట్టడి కోసం లాక్ డౌన్ ను విధించి , కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేయడంతో కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. తాజాగా గత 24 గంటల్లో.. మంగళవారం.. 62,224 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఈ మహమ్మారి కారణంగా నిన్న 2,542 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజగా నమోదైన గణాంకాల ప్రకారం మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,33,105 కి చేరగా మరణాల సంఖ్య 3,79,573 కి పెరగింది. ఈ మేరకు బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 1,07,628 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,83,88,100 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 8,65,432 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలాఉంటే దేశంలో ఇప్పటివరకూ.. 26,19,72,014 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,00,458 మందికి వ్యాక్సిన్ డోసులు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతం తగ్గిందని.. ప్రస్తుతం 4.17శాతంగా ఉందని తెలిపింది. రికవరీ రేటు 95.80శాతానికి పెరిగిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.