ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పట్టుబడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గలేదని.. కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తున్నదని.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలైందని ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళలేం అని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లగా హైకోర్టు ఎన్నికల షెడ్యూల్‌ను కొట్టేసింది. అయితే కమిషనర్ నిమ్మగడ్డ మళ్లీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లారు. ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఎన్నికలు పెట్టడం కుదరదని చెబుతున్నది.
అయితే ఇటీవల కేరళ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాక కరోనా కేసులు పెరిగాయి. కేరళలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అక్కడ ఎల్డీఎఫ్ విజయం సాధించింది. అయితే ఎన్నికలకు ముందు కేరళలో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఎన్నికల పూర్తయ్యాక అక్కడ.. రోజుకు 6 వేల కేసులు నమోదవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే కేరళ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఎక్కువ. అక్కడా చాలామంది విద్యాధికులే ఉంటారు. కరోనాపై పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది అక్కడి ప్రజలకు. అయినప్పటికీ కరోనా విస్తరించింది.
అటువంటిది ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహిస్తే కరోనా విస్తరించే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. కేరళలోనే ఆ స్థాయిలో విస్తరిస్తే ఇక ఏపీలో అంతకంటే ఎక్కువ కేసులే వస్తాయని వాళ్లు అంటున్నారు. ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.