ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మహ్మమారికి చెక్ పెట్టే వ్యాక్సిన్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు పరిశోధనలు.. ప్రయోగాలు మాత్రమే చేసిన దానికి భిన్నంగా రెండు దేశాలు.. రెండు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి ఓకే చెప్పేశాయి.
రష్యా డెవలప్ చేస్తున్న స్పుత్నిక్ వ్యాక్సిన్ ను వచ్చే వారం నుంచి సామూహికంగా షురూ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. మరోవైపు యూకే ప్రభుత్వం సైతం.. తమ ఫైజర్ బయోఎంటెక్ వ్యాక్సిన్ ను విస్తృతంగా ఉపయోగించాలని భావిస్తోంది. ఫైజర్ బయో ఎన్ టెక్ తయారుచేసిన టీకాను అత్యవసర వినియోగానికి బ్రిటీష్ ప్రభుత్వం ఓకే చెప్పింది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి యూకే ప్రకటించిన గంటల వ్యవధిలోనే రష్యా స్పందించింది. సామూహిక వ్యాక్సినేషన్ కు ఓకే చెబుతూ ప్రకటన జారీ చేయటం గమనార్హం. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 95 వాతం సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లోస్పుత్నిక్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.740 కంటే తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. రెండు డోసుల వినియోగానికి రూ.1500 వరకు ఖర్చు కానుంది. ఈ వ్యాక్సిన్ ను భారత్ లో డాక్టర రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ తయారు చేయనుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నుంచి క్లియరెన్సు పొందిన తర్వాత.. స్పుత్నిక్ క్లినిక్ల ట్రయల్స్ ను షురూ చేశారు.