తెలంగాణలో మహమ్మారికి చికిత్స చేసేందుకు గాంధీ ఆసుపత్రిని ఎంపిక చేయటం.. వందలాది మందికి చికిత్స చేయటం తెలిసిందే. గాంధీకి తోడుగా కింగ్ కోఠి.. చెస్టు ఆసుపత్రి.. ఫీవర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసినా.. గాంధీ స్థాయిలో పెద్ద ఎత్తున బెడ్స్ లేవు. రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు చేసిన గచ్చిబౌలి లోని టిమ్స్ ను ఈ రోజు (సోమవారం) నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. గాంధీలో 1160 బెడ్స్ ఉంటే.. ఈ మధ్యన మరో 350 బెడ్స్ ను పెంచారు. టిమ్స్ లో 1500 బెడ్లతో ఏర్పాట్లు పూర్తి చేయటం తెలిసిందే.
టిమ్స్ తో పాటు.. నిమ్ష్ ను కూడా మహమ్మారి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇక్కడ మాత్రం మాయదారి రోగం బారిన పడిన వైద్యులు.. వైద్య సిబ్బందితో పాటు.. రాజకీయ నాయకులు.. ప్రముఖులకు చికిత్స చేసేందుకు వీలుగా ఈ ఆసుపత్రిని వినియోగించనున్నారు.
నిమ్స్ లోని పాత భవనంలో ఉన్న ఆరు బ్లాకుల్లో ఏ..బీ..సీ బ్లాకులను వినియోగించనున్నారు. ఈ భవనానికి ఇతర విభాగాలతో సంబంధం లేకుండా బంజారాహిల్స్ రోడ్డులో ఉన్న గేట్ నుంచి ఎంట్రీ ఉండేలా ఏర్పాట్లుచేస్తున్నారు. పెరుగుతున్న కేసులకు తగ్గట్లే కొత్త ఆసుపత్రుల వినియోగం మంచిదే అయినా.. రానున్న రోజుల్లో ట్రీట్ మెంట్ కు ఇవి సరిపోవన్న మాట వినిపిస్తోంది. మరి.. అందుకు తగ్గ ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం ఏం చేయనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.