కరోనా తీవ్రతతో హైదరాబాద్ అల్లకల్లోలంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. గత రెండు వారాలుగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతీరోజు కోవిడ్ బాధితుల సంఖ్య 1500 వరకు నమోదవుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాలు కరోనాకు హాట్ స్పాట్లుగా ఉన్నాయి.
అయితే తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు షాకింగ్ విషయాన్ని బయటపెట్టినట్టు సమాచారం. హైదరాబాద్ లో రెండు వారాలుగా 2200మందికి పైగా రోగులు మిస్సయ్యారని జీహెచ్ఎంసీ గుర్తించినట్టు ప్రచారం జరుగుతోంది. వీరంతా తప్పుడు ఫోన్ నంబర్లు, అడ్రస్ ఇచ్చారని అంటున్నారు. కరోనా రోగులకు ప్రభుత్వం హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తోంది. ఇంట్లో ఉండే కరోనా చికిత్స పొందుతున్న వారి వివరాలను జీహెచ్ఎంసీ అధికారులు సేకరిస్తున్నారు.
అయితే కరోనా వచ్చిందని తెలిస్తే సమాజంలో అవమానాలు.. వెలివేతలు ఎక్కువైపోవడంతో వారంతా ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారని తెలిసింది. ఆధార్ కార్డ్ లో శాశ్వత చిరునామా తప్పుగా ఉండి .. వేరే చోట నివాసం ఉంటున్నవారు కరెక్ట్ అడ్రస్ లు ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారట. దీంతో కరోనా బాధితులను.. వారి కాంటాక్టులను గుర్తించడం కష్టంగా మారిందని తలపట్టుకుంటున్నట్టు సమాచారం.
హోం ఐసోలేషన్ కిట్లను అందించేందుకు ఫోన్లు, అడ్రస్ లలో సంప్రదించగా.. వారి చిరునామాలు తప్పుగా ఉంటున్నాయని జీహెచ్ఎంసీ అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదట.. వీరంతా రోడ్లమీదకు వెళితే ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకుతుందని.. మరింత వ్యాపిస్తుందని.. మిస్సయిన వారు ముందుకు వచ్చి సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ తాజాగా హైదరాబాద్ వాసులకు పిలుపునిచ్చారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారంతా ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకోవడం.. కొందరు దొరికినా అవమానానికి ఐసోలేషన్ కిట్లు తీసుకోవడం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. దీంతో హైదరాబాద్ లో వారంతా కరోనా బాంబర్లుగా మారే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.. వెంటనే వీరిని గుర్తించకపోతే మరింత వ్యాపిస్తుందని భయపడుతున్నారు.