చూస్తుండగానే కరోనా కేసులు తెలంగాణ రాష్ట్రంలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ.. వైరస్ వ్యాప్తిని నిరోధించే విషయంలో కేసీఆర్ సర్కారు తీసుకుంటున్న చర్యల్ని పలువురు తప్పు పడుతున్నారు. మాటలే తప్పించి.. చేతల్లో కనిపించటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. మాస్కు పెట్టుకోకుండా రోడ్లపై తిరిగే వారి మీద తీసుకోవల్సిన చర్యల ఆశించిన స్థాయిలో లేవు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన తెలంగాణ హైకోర్టు షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
తాము చేస్తున్న పనుల గురించి గొప్పలు చెప్పుకునే అధికారులు ప్రస్తావించే గణాంకాల్ని కోర్టు తప్పు పట్టింది. 2020 మార్చి 24 నుంచి 2020 ఏప్రిల్ మధ్య డీఎం యాక్టు కింద 8417మందిపైనా.. మాస్కులు ధరించని 1.64 లక్షల మందిపైన కేసులు నమోదు చేసినట్లుగా డీజీపీ పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించని వారిపై 2456 కేసులు.. గుమిగూడిన ఘటనలపై 322.. బహిరంగ స్థలాల్లో ఉమ్మిన వారిపై ఆరు కేసులు.. మద్యం సేవించటం.. పాన్.. గుట్కా.. పొగాకు వినియోగించిన వారిపై 27వేలకు పైగా కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనల విషయంలో 62,220 మందిని అరెస్టు చేశామని.. రూ.58.92 కోట్ల జరిమానాలు విధించినట్లుగా పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన హైకోర్టు అనూహ్య వ్యాఖ్యలు చేసింది. డీజీపీ ఇచ్చిన గణాంకాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ‘‘ఇవి చాలా తక్కువ’’ అని వ్యాఖ్యానించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నిఘా పెడితే.. మాస్కులు ధరించకుండా బయటకు తిరిగేవారు లక్షల్లో ఉంటారని.. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. లాక్ డౌన్ పెట్టమని తాము చెప్పటం లేదని.. కరోనా నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని తాము చెబుతున్నామన్నారు.
వైన్ షాపులు.. బార్లు.. హోటళ్ల వద్ద నిఘా పెంచాలని సూచన చేసింది. తదుపరి విచారణకు ఈ తరహా ఉల్లంఘనలపై తీసుకున్న చర్యలు ఏమిటి? ఎంతమందిపై కేసులు నమోదు చేశారు? లాంటి వివరాల్ని తమకు అందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. వివాహాది శుభకార్యాలకు 200 మంది అతిథులకు మించకుండా వేడుకల్ని చేసుకోవటానికి అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం శుభకార్యాలు.. పండుగలపై ఆంక్షలు విధిస్తున్నప్పుడు యువతను ఆకర్షించే సినిమా థియేటర్లు.. పబ్బులు.. క్లబ్బులు.. స్విమింగ్ ఫూల్స్ పై ఆంక్షలు ఎందుకు పెట్టటం లేదని ప్రశ్నించింది.