కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. మొన్నటివరకు తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల ఫర్లేదన్న స్థాయి నుంచి ఇప్పుడు పోటెత్తిన పరిస్థితి. నెల వ్యవధిలో వచ్చిన మార్పు ఇప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. రోజువారీగా నమోదవుతున్న కేసుల కారణంగా ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి. మొత్తం కేసుల్లో మూడో వంతు మంది ఇప్పుడు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రోజు గడిచే కొద్దీ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
కేవలం నెలన్నర వ్యవధిలో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు వెయ్యి మంది ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిది రెట్లు పెరగటం ఆందోళన కలిగిస్తుంది. అంతేకాదు.. నెలన్నర వ్యవధిలో రికవరీ రేటు సైతం బాగా తగ్గిపోయింది. 98.8 శాతం నుంచి 91.8 శాతానికి తగ్గినట్లుగా అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నెలన్నర క్రితం కేసుల సంఖ్య 178ఉంటే.. ఇప్పుడు మూడు వేలను దాటేసింది. సెకండ్ వేవ్ తీవ్రత కొద్దికాలంలోనే భారీగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఉగ్రరూపం దాల్చటం ఖాయమన్న అభిప్రాయం వైద్య ఆరోగ్య వర్గాల్లో వినిపిస్తోంది.
నెలన్నర క్రితం యాక్టివ్ కేసులు 1939 ఉండగా.. అందులో 850 మంది ఐసోలేషన్ తో ఉంటే.. మిగిలిన 1089 మంది ఆసుపత్రుల్లో చేరారు. తాజాగా లెక్కల ప్రకారం కరోనా యాక్టివ్ కేసులు ఏకంగా 25,459కు చేరుకోవటం ఆందోళన కలిగించే అంశం. అందులో 16,892 మంది ఐసోలేషన్ లో ఉండగా.. ఆసుపత్రుల్లో 8567 మంది ఉన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 2292 మంది ఐసీయూలో లేదంటే వెంటిలేటర్ మీదా ఉంటే.. 4233 మంది ఆక్సిజన్ పై చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐసీయూలో ఉన్న వారి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
ఆందోళన కలిగించే మరో అంశం ఏమంటే.. నెలన్నర వ్యవధిలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఫిబ్రవరి 26న 98.8 శాతం రికవరీ రేటు ఉండగా.. తాజాగా 91.86 శాతానికి తగ్గింది. మొన్నటివరకు కరోనా కేసుల తీవ్రత ఆందోళన కలిగించేలా లేకున్నా.. గడిచిన కొద్ది రోజుల నుంచి మాత్రం పరిస్థితుల్లో మార్పు రావటమే కాదు.. ఆసుపత్రుల్లో బెడ్ల కొరతతో పాటు.. అత్యవసరమైన రెమిడెసివర్ లాంటి వాటి కొరత కూడా ఎక్కువైంది.