కరోనా: బెడ్స్‌ ఫుల్ .. కార్పొరేట్ ఆస్పత్రుల్లో జరిగేది ఇదే !

Update: 2021-04-17 04:30 GMT
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా మహమ్మారి మరణమృదంగం వాయిస్తుంది. రోజురోజుకి వెలుగులోకి వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర , కేరళ , కర్ణాటక , ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఆ ప్రభావం కూడా తెలంగాణ లో కనిపిస్తుంది. ఒక్కరోజే దాదాపుగా మూడు వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అందరిలో ఆందోళన మొదలైంది. మరోవైపు రాష్ట్రంలో లాక్ డౌన్ మరోసారి వేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయితే, మంత్రి ఈటెల మాత్రం రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ వేసే అవకాశం అయితే లేదు అని, అలాగే కర్ఫ్యూ , 144 సెక్షన్ అమల్లోకి తీసుకువచ్చే అవకాశం కూడా లేదు అని అన్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా జోరు పెరుగుతుంది .. ఆక్సిజన్ నిలువలు తక్కువగా ఉన్నాయి. అవసరం అయితే , తప్ప ఇంటి నుండి బయటకి రాకండి అని చెప్తున్నారు.

ఇదిలా ఉంటే .. కరోనా నిర్దారణ అయిన వారికి హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకడం కష్టంగా మారింది. ఇదిలా ఉండగా ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటులో ఉన్నాయని ఒకవైపు ప్రభుత్వం చెబుతున్నా.. ప్రైవేటు ఆసుప్రత్రులు మాత్రం బెట్స్‌ ఖాళీగా లేవని చెబుతున్నాయి. కోవిడ్‌ బెడ్స్‌కు సంబంధించి ఓ శాటిలైట్ ఛానెల్ చేసిన పరిశోధనలో కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. కానీ తీరా ప్రసార మీడియా కి చెందిన ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి కరోనా బెడ్స్‌ కోసం ఆరా తీయగా ఖాళీ లేవని వైద్యులు చెబుతున్నారట. అంతేగాక ఎప్పుడు ఖాళీ అవుతాయో కూడా చెప్పలేమని చేతులెత్తేస్తున్నారట. అయితే, అక్కడే ఉన్న  స్థానిక సెక్యూరిటీని కదిలిస్తే.. మహారాష్ట్ర నాందేడ్‌ నుంచి పేషెంట్లు వస్తున్నారని, వారితోనేబెడ్స్‌ నిండిపోయాయి సార్’ అంటూ బాంబు పేల్చాడు. పైగా ఇక్కడ ఖాళీ లేవు కానీ తనకు తెలిసిన ఆస్పత్రిలో ఫ్రెండ్‌ పని చేస్తాడట... అక్కడ కాస్త కాసులు ఎక్కువ పెడితే బెడ్‌ దొరికిపోతుందని ఉచిత సలహా ఇస్తున్నాడు. మొత్తంగా ఈ కరోనా కాలంలో కార్పొరేట్ హాస్పిటల్స్ కాసుల వేటలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి.
Tags:    

Similar News